నా వక్షోజాల పై చేతులు వేసాడు.... హీరోయిన్ల ఒక్కఒక్కరిదీ ఒక్కొ చేదు అనుభవం

చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూస్‌ అనే విషయంపై బాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ రాజీవ్‌ మసంద్‌ నిర్వహించిన చర్చా వేదికపై సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ విషయాలను వెల్లడించింది

చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూస్‌ (పిల్లలపై లైంగిక వేధింపులు) అనే విషయంపై బాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ రాజీవ్‌ మసంద్‌ నిర్వహించిన చర్చా వేదికపై స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. ఈ చర్చా కార్యక్రమంలో ఆమెతోపాటు అలియా భట్‌, అనుష్కా శర్మ, విద్యా బాలన్‌, రాధికా ఆప్టే పాల్గొన్నారు.

ప్రతి ఒక్క మహిళా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య లైంగిక వేధింపులు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో అనుభవిస్తున్నారు కొందరు బయటకి చెప్తున్నారు కొందరు బయపడి వాళ్లలోనే దాచుకొంటున్నారు .ఈ సమస్య సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు.మొన్నటికి మొన్న తాప్సీ పింక్ సినిమా ప్రమోషన్ సమయంలో కాలేజీ చదివే సమయంలో తను ఎదుర్కొన్న వేధింపులు గురించి చెప్తు కంట తడి పెట్టుకొంది .ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా వున్నా అనుష్క శ‌ర్మ, విద్యాబాల‌న్‌,ఆలియా భ‌ట్‌,రాధికా ఆప్టే లు ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓ డెబిట్ లో చెప్పుకొన్నారు .

 కంటతడి పెట్టుకుంది:

కంటతడి పెట్టుకుంది:


లైంగిక వేధింపులు సామాన్యులకే కాదు. సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు. మొన్న ‘పింక్' సినిమా ప్రమోషన్ సమయంలో హీరోయిన్ తాప్సీ కాలేజీ చదువుకున్న రోజుల్లో తనకు ఎదురైన వేధింపుల గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వున్న ఆలియా భ‌ట్‌, అనుష్క శ‌ర్మ, విద్యాబాల‌న్‌, రాధికా ఆప్టే లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఏకంగా ఓ డిబేట్ లో చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ రౌండ్ టేబుల్:

బాలీవుడ్ రౌండ్ టేబుల్:

ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మ‌న్సద్ బాలీవుడ్ రౌండ్ టేబుల్ అని ఓ చర్చ కార్యక్రమం పెట్టారు .ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క శ‌ర్మ, విద్యాబాల‌న్‌,ఆలియా భ‌ట్‌,రాధికా ఆప్టే లు తాము ఎదురుకున్న సంఘటనలు గురించి వివరించారు. తానూ లైంగిక వేధింపులకు మినహాయింపు కాదని చెప్పింది సోన‌మ్ క‌పూర్ .ఆ సంఘటన ఇప్పటికి నన్ను వేధిస్తూనే ఉంది.. కానీ అప్పుడు పద్ద నరకం కూడా మామూలుది కాదు.
 అనుష్క శర్మ :

అనుష్క శర్మ :


ఇక ఆ వెంటనే తానూ ఓపెన్ అయిపోయిన అనుష్క శర్మ కూడా చిన్నత‌నంలో త‌న త‌ల్లి కూడా ఎవ‌రైనా త‌న‌తో అస‌భ్యంగా ప్రవ‌ర్తించారా అని అడిగేద‌ని, ఆమె అలా ఎందుకు అడుగుతోందో త‌న‌కు అర్థమ‌య్యేది కాద‌ని చెప్పింది. ఇలాంటి ఘటనలు చూసే తాను నైతిక‌త గురించి ప్రశ్నించ‌డం మొద‌లుపెట్టాన‌ని మరో హీరోయిన్ రాధికా ఆప్టే వెల్లడించింది.

 లైంగిక వేధింపులు:

లైంగిక వేధింపులు:


ఇది ప్రోమో మాత్రమే ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు చెప్తారో చూడాలి. ఈ కార్యక్రమంలో 13 ఏళ్ల వయసులో ఉండగా సినిమా థియేటర్‌లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పింది సోనమ్‌. ‘ప్రతీ మహిళా చిన్న వయసులో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటుంది.

 13 ఏళ్ల వయసున్నప్పుడు:

13 ఏళ్ల వయసున్నప్పుడు:


నాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు నేను లైంగిక వేధింపునకు గురైన విషయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. రవీనా టాండన్‌, అక్షయ్‌ కుమార్‌తో కలిసి నేను, నా స్నేహితులు గెలాక్సీ థియేటర్‌లో ఓ సినిమా చూసేందుకు వెళ్లాం. ఇంటర్వెల్‌ సమయంలో నేను, నా ఫ్రెండ్స్‌ స్నాక్స్‌ తెచ్చుకునేందుకు బయటకు వచ్చాం.

కన్నీళ్లు వస్తూనే ఉన్నాయ్:

కన్నీళ్లు వస్తూనే ఉన్నాయ్:

మా స్నేహితులంతా ఒకరివెనుక ఒకరు నడుస్తున్నాం. అందరి కంటే నేనే వెనుక ఉన్నా. ఎందుకంటే అందరిలోకీ నేను పొడవు. అలా వెనకాల నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి వెనుక నుంచి నా వక్షోజాలపై చెయ్యి వేశాడు. ఆ సమయంలో నాకు వణుకు మొదలై ఏడుపు వచ్చేసింది. ఎవరికీ చెప్పకుండా నాలో నేనే ఏడ్చాను. మిగిలిన సినిమా చూస్తున్నంత సేపూ నాకు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయ'ని సోనమ్‌ చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X