Siddhanth Kapoor: డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ సోదరుడు.. పోలీసుల అదుపులో ప్రముఖులు

సినీ రంగాన్ని డ్రగ్స్ కేసులు వదలడం లేదు. చాలా మంది సినీ ప్రముఖులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లు తరచూ నిషేదిత ఉత్ప్రేరకాలను వాడడం.. పోలీసులకు చిక్కడం వంటివి జరుగుతున్నాయి. దీంతో తరచూ ఈ తరహా కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ పార్టీలు, పబ్బులపై దాడులు చేస్తున్నారు. దీంతో మరికొందరు ఈ డ్రగ్స్ కేసుల్లో చిక్కుకుంటున్నారు. అ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ సోదరుడు, ఫేమస్ యాక్టర్‌ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఆదివారం రాత్రి బెంగళూరులో ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగిన ఓ పార్టీలో నిషేదిత డ్రగ్స్‌ను వాడుతున్నారన్న పక్కా సమాచారంతో నగర పోలీసులు దాడులు చేశారు. ఇందులో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో బాలీవుడ్ నటి, సాహో మూవీ ఫేం శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఆరుగురు ప్రముఖులను సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వీళ్లందరికీ పోలీసులు రక్త పరీక్షలు నిర్వహించగా.. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని సమాచారం. దీంతో ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది.

Bollywood Actress Shraddha Kapoor Brother Siddhanth Kapoor Detained In Drugs Case

బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఉన్న ఈ హోటల్‌లో పార్టీపై పోలీసులు కన్నేసి ఉంచినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే పార్టీ ప్రారంభం అయిన చాలా సేపటి తర్వాత పోలీసులు దాడులు నిర్వహించారట. అందులో చాలా మంది పాల్గొన్నప్పటికీ సిద్ధాంత్ కపూర్‌ సహా మరో ఆరుగురిపై అనుమానం ఉండడంతో వీళ్లను మాత్రమే అదుపులోకి తీసుకుని పరీక్షలు జరిపించినట్లు తెలుస్తోంది. అయితే, వీళ్లు డ్రగ్స్ సేవించే పార్టీకి వచ్చారా? లేక పార్టీలోనే డ్రగ్స్‌ను తీసుకున్నారా అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందుకోసం హోటల్ యాజమాన్యాన్ని, పార్టీకి హాజరైన పలువురిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

శ్రద్దా కపూర్ సోదరుడైన సిద్దాంత్ కపూర్.. 1997లో వచ్చిన 'జుడ్వా' అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారి ఎన్నో సినిమాలకు పని చేశాడు. ఈ క్రమంలోనే 2013లో వచ్చిన 'షూటౌట్ ఎట్ వాడాలా' అనే సినిమాతో నటుడిగా మారాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే 'అగ్లీ', 'హసీనా పార్కర్', 'పల్టన్', 'యారమ్', 'హలో చార్లీ' వంటి సినిమాల్లో నటించాడు. అలాగే, 'భవుక్కల్' అనే వెబ్ సిరీస్‌లో కూడా భాగం అయ్యాడు. వీటితో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా చేశాడు.

ఇదిలా ఉండగా.. సిద్దాంత్ కపూర్ అరెస్ట్ గురించి బాలీవుడ్‌ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఆయన కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో అసలేం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఇప్పుడీ కేసు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X