'రెడ్ కార్పెట్' పై సందడి చేయనున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సిద్దమైంది. గత రెండు సంవత్సరాలుగా సౌందర్య దిగ్గజమైన 'లోరెల్ పారిస్' కు బ్రాండ్ అంబాసిడర్ గా సోనమ్ కపూర్ వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమానికి హాజరవనున్న సందర్బంలో సోనమ్ తన మనసులోని మాటలను ఇలా వెలిబుచ్చారు.
అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చక్కని వేదిక కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం. ఇలాంటి అరుదైన కార్యక్రమనంలో తాను పాలుపంచుకొంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని.. ఇక్కడ జరగనున్న ముగింపు వేడుకలలో ఉత్తమ చిత్రం అవార్డులను ఏ సినిమాలు అందుకోనున్నాయో చూసేందుకు సంతోషిస్తున్నాను అని అన్నారు.
గత 15 సంవత్సరాలుగా 'లోరెల్ పారిస్' అఫీసియల్ మేకప్ పాట్నర్ గా కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే 16 నుండి ప్రారంభై మే 27వరకు ఈ సినిమా సంబరాలు జరగనున్నాయి. 26 సంవత్సరాలు వయసు కలిగిన సోనమ్ కపూర్ ముగింపు వేడుకలలో అతిరధ మహారధులతో రెడ్ కార్పెట్‌పై నడవనున్నారు.
గతంలో 'లోరెల్ పారిస్' కు బ్రాండ్ అంబాసిడర్లగా పని చేసిన 35 మందితో కలసి ఈ రెడ్ కార్పెట్ పై సోనమ్ నడవనుంది. ఈ కార్యకమంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, ప్రీదా పింటో, ఇవా లంగోరియా, జేన్ ఫోండా, బినాకా బాల్టీలు తదితరులు పాల్గోనున్నారు.


Click it and Unblock the Notifications












