Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా: పుష్ప 2 పై బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ..

Allu Arjun: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'పుష్ప-2'(Pushpa 2: The Rule). అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫాజిల్ వంటి అగ్ర తారాగణంతో తెరకెక్కించిన పుష్ప 2 సినిమా.. పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తుంది. ఈ భారీ బడ్జెట్ మూవీ పై బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం తన వైపుకు చూసేలా చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఏమని కామెంట్ చేసిందంటే..?

పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు వెళ్తుంది. ఎవరు ఊహించని విధంగా కేవలం ఆరు రోజులలో 1000కోట్ల క్లబ్బులు చేరింది. ఇప్పటివరకు పుష్ప 2 మూవీ 1002 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. దీంతో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడి వంటి సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసినట్లు అయ్యింది. అంతకు ముందుకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రూ.294 కోట్లు వసూలు చేసిన మూవీగా పుష్ప 2 రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

Bollywood actress Urvashi Rautela says Second National Award loading for Allu Arjun Pushpa 2

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ కు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. స్పెషల్ గా జాతర ఎపిసోడ్ సమయంలో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మరో లెవెల్. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ పోస్ట్ పెడుతున్నారు . కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలే కాకుండా బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాపై, అల్లు అర్జున్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ నటనకు అభిమానిని, అతడు ఎంతోమంది నటులకు స్ఫూర్తి అంటూ బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ పేర్కొనడం గమనార్హం. బాలీవుడ్ ప్రముఖులు హీరోలు అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేల అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించింది. పుష్ప 2 సినిమాలోని ప్రతి ఒకరి నటన అద్భుతం గా ఉంది. సినిమాలోని జాతర సన్నివేశం చాలా బాగుంది. అల్లు అర్జున్ నటన చాలా అద్భుతంగా ఎత్తుకు పైకెత్తు వేసినట్లు ఉంది. జాతర సీన్స్ లో ఆయన అద్భుతమైన ప్రదర్శన అద్భుతమైన నటన రెండవసారి జాతీయ అవార్డు వస్తుందని నమ్మకం కలిగిస్తుంది. తప్పకుండా ఈ సినిమాకు జాతీయం స్థాయిలో అవార్డు అందుకుంటారు. మూవీ టీం అందరికీ శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తుంది.

Bollywood actress Urvashi Rautela says Second National Award loading for Allu Arjun Pushpa 2

ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఈ ట్వీట్ పై కొందరు ప్రశంసలు కురిపించగా .. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ నటన మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఎందరో సినీ ప్రముఖులు బన్నీ నటనను కొనియాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X