వైరల్ ఫోటోస్: మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్... ముసలితనం వచ్చాక ఇలా!

మొబైల్ ఫోన్ విప్లవం వచ్చిన తర్వాత టెక్నాలజీ ఎవరూ ఊహించని విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది. అరచేతిలోనే అన్నీ కనిపించే ఈ ఇంటర్నెట్ యుగంలో రోజుకో కొత్త యాప్ యూజర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఓ యాప్ సెలబ్రిటీ సర్కిల్‌లో వైరల్ అయింది.

'ఫేస్‌యాప్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్... మనం ఓల్డేజ్‌లోకి వచ్చిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూపెడుతోంది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యాప్ ఉపయోగించి తమ ఓల్డ్ లుక్ ఎలా ఉందో చూసుకుని మురిసిపోతున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి.

అర్జున్ కపూర్

అర్జున్ కపూర్

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఫేస్ యాప్ ఉపయోగించి ఓల్డేజ్ వచ్చిన తర్వాత తన లుక్ ఎలా ఉండబోతోందో అభిమానులు చూపించే ప్రయత్నం చేశారు. అతడు పోస్ట్ చేసిన ఈ ఫోటోకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

వరుణ్ ధావన్

వరుణ్ ధావన్

మరో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఫేస్ యాప్ ఉపయోగించి తన ఓల్టేజ్ లుక్ అభిమానులతో పంచుకున్నారు. 70 ఏళ్ల వయసులో నేను ఇలా ఉంటాను అని పేర్కొన్నారు. ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోను అని స్పష్టం చేశారు. అనిల్ కపూర్ సర్ 100 ఏళ్లు వచ్చినా ఆయన ఫిట్‌గానే ఉంటారని వరుణ్ పేర్కొన్నారు.

సోనమ్ కపూర్ షాకింగ్ లుక్

సోనమ్ కపూర్ షాకింగ్ లుక్

సోనమ్ కపూర్ ఫోటోను కొందరు అభిమానులు ఫేస్ యాప్ ద్వారా ముసలమ్మగా మార్చేశారు. ముడతలు పడిన ముఖంతో ఈ హీరోయిన్ లుక్ చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. బాబాయ్ సోనమ్‌ను ఇలా చూడలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

40 ఏళ్ల వయసులోనూ మహేష్ బాబు పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఒక వేళ ఆయన ఓల్టేజ్‌లోకి వెళితే ఎలా ఉంటారో చూపించే పిక్ ఇది. కొందరు ఫ్యాన్స్ ఫేస్ యాప్ ద్వారా మహేష్ బాబు వృద్దాప్య లుక్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. ఏజ్ పెరిగినా మహేష్ బాబులో గ్లామర్ తగ్గే అవకాశం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

ఎన్టీఆర్ వాళ్ల తాతలాగే ఉన్నారు

ఎన్టీఆర్ వాళ్ల తాతలాగే ఉన్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోను కూడా కొందరు ఫ్యాన్స్ ఫేస్ యాప్ ద్వారా ఇలా మార్చేశారు. ఆయన ఓల్టేజ్ వచ్చిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలకు మరింత దగ్గరగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభాస్

ప్రభాస్

ఓల్డేజీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలా ఉంటారో ఈ ఫోటో చూసి అవగాహనకు రావొచ్చు. ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ ఫేస్ యాప్ ద్వారా ఓల్డ్ లుక్‌లో మార్చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X