For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మన హీరోయిన్స్... సర్జరీ అందాలు ఇవే... (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: బాలీవుడ్‌లో అందం కోసం ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవటం సర్వసాధారణమై పోయింది. హీరోయిన్స్ తమ సహజ సిద్ధమైన శరీరాకృతికి భిన్నంగా అందంగా కనిపించేందుకు వీటిని చేయించుకొని వెండి తెరపై వెలుగులు విరజిమ్ముతున్నారు. ముఖ్యంగా మన దేశంలో బాలీవుడ్ పెద్ద మార్కెట్ కావటంతో అక్కడ స్టార్స్ ఈ సర్జరీలను చాలా కామన్ గా తీసుకుంటున్నారు.

  ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగుతున్న హీరోయిన్స్ చాలా మంది సర్జరీలు చేయించుకున్నవారే. అందులో కొందరు ముక్కుకు చేయించుకుంటే మరికొందరు పెదాలకు చేయించుకుంటున్నారు. ఇవి చాలదంటున్నట్లు మరికొందరు తమ వక్షోజాలకు సర్జరీ చేయించుకుని అందాలు పెంచుకుంటున్నారు.

  ఇంతకీ ఈ సర్జరీల వీరి కెరీర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయి అనేది ముందు చూడాలంటే వారు సర్జరీకు ముందు తర్వాత ఏ విధంగా మార్పులు వచ్చాయి అనేది గమనిస్తే చాలు... తమ ముఖవర్చసు, ఇతర శరీర భాగాలకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాలను ఆరబోస్తున్నారు. బాలీవుడ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న హీరోయిన్స్ పై ధట్స్ తెలుగు ప్రత్యేక కథనం...

  కరీనా కపూర్‌: 'టషన్‌' చిత్రంలో ఈ అందాల భామ తన సహజ సిద్ధమైన అందాలతో కాకుండా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొని తన అందానికి ఒక అద్భుత నిర్వచనాన్ని వెండి తెరపై చూపించారు. షడ్బుజాకార ముఖ వర్చసుతో నూతన సాంకేతికతను ఉపయోగించుకొని తన రూపురేఖలను మార్చుకున్న ఘనత అందాల బేబోకే దక్కుతోంది.

  ప్రియాంక చోప్రా: అసలే అందంగా ఉండే ప్రియాంక చోప్రా తన ముక్కును మరింత సన్నగా చూపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది. దీంతో నాటి నుంచి నేటి వరకు ప్రియాంక అందాలు చెక్కు చెదరలేదు.

  కంగనా రౌనత్‌: ఈ బాలీవుడ్‌ భామ మిగతా కథానాయికల బాటలోనే పయనించింది. ఆమె తన అందాల కోసం వివిధ శరీర భాగాలలో కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకొని తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.

  శిల్పా శెట్టి: ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లలోని తన అభిమానులను నిరాశపరచకుండా ఉండేందుకు రెండు పర్యాయాలు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొన్నారు. ఇప్పటికీ తన సౌందర్యాన్ని ప్రపంచానికి చాటుతోంది మన శిల్ప.

  రాఖీ సావంత్‌: ఈ వివాదాస్పద బాలీవుడ్‌ రాణి తన శరీరంలోని వివిధ భాగాలకు ప్లాస్టిక్‌ టెక్నాలజీ ద్వారా మెరుగులు దిద్దుకున్నారు. ఈమె ముక్కు, పెదవులకు సైతం ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవడం విశేషం. తన సెక్సీ ఇమేజ్ ని పెంచుకోవటానికి బ్రెస్ట్ ఇంప్లాట్ సర్జరీ చేయించుకుంది.

  రాణీ ముఖర్జీ: ఈ బెంగాలీ సుందరి అంద చందాలకేమీ తక్కువలేకున్నా కేవలం తన ముక్కుకు మాత్రమే ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొని మిగతా కథానాయికల బాటలో పయనించింది.

  కోయినా మిత్ర: తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన విధంగా ప్లాస్టిక్‌ సర్జరీ టెక్నాలజీ ఆమెను కళావిహీనంగా మార్చింది. తన ముక్కు, ముఖానికి చేయించుకొన్న సర్జరీ వికటించింది.

  మాధురి దీక్షిత్: ఏక్.. దో.. తీన్ అంటూ నడుం ఊపులతో బాలీవుడ్ ని ఊపిన మాధురి దీక్షిత్ అందచందాలుపై అప్పట్లో సర్జరీ రూమర్స్ వచ్చాయి.

  శ్రీదేవి: ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె వెలిగిపోయిన సంగతి అందరికీ గుర్తే.

  సమీరా రెడ్డి: మొదట్లో ఎంతో బరువు ఉండే ఆమె తేలికపాటి సర్జరీతో స్లిమ్ సుందరిగా మారి.. బిజీ అయ్యిపోయింది.

  English summary
  Here are some of the Bollywood beauties, whose lives have changed after these surgeries. Surgeries are life transforming for our Heroines.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X