సినిమా స్టార్లకు వాళ్లంటే తెగ మోజు! (ఫోటో ఫీచర్)
ముంబై: హీరోలు, హీరోయిన్లు అంటే మోజు పడే వాళ్లు మనలో చాలా మంది ఉంటారు. అలాగే సినిమా స్టార్లకు కూడా కొందరిపై మోజు ఉంటుంది. ముఖ్యంగా ఈ తరం యంగ్ బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా తమ కోస్టార్లపైనే మోజు పడుతున్నారు. తాము మోజు పడే వ్యక్తుల గురించి వారు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్...హీరో హృతి రోషన్ కండల తిరిగిన బాడీ చూసి ఫిదా అయిపోయిందట. తాను సినిమాల్లోకి రాక ముందు నుండే హృతిక్ రోషన్ అంటే చాలా మోజు ఉండేదని చెబుతోంది. హృతిక్ రోషన్ తొలి చిత్రం 'కహోనా ప్యార్ హై' చిత్రం నుండి ఇప్పటి వరకు అతనికి సంబంధించిన చాలా ఫోటోలు కలెక్ట్ చేసిందట.
అదే విధంగా హీరోయిన్ పరిణీతి చోప్రాకు....సైఫ్ అలీ ఖాన్ అంటే చాలా ఇష్టమట. అవకాశం వస్తే అతన్ని పెళ్లి కూడా చేసుకుంటానంటోంది. ఇలా బాలీవుడ్ తారలు మోజు పడే వ్యక్తుల గురించి స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం...

శ్రద్ధా కపూర్
తనకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని, అతను చాలా అందంగా ఉంటాడు అని అంటోంది శ్రద్దా కపూర్.

సోనమ్ కపూర్
హీరోయిన్ సోనమ్ కపూర్‌కు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమట. కహోనా ప్యార్ హై చిత్రంలో హృతిక్ పోషించిన రోహిత్ పాత్ర చూసిన తర్వాత ఇతర గర్ల్స్ మాదిరిగానే తాను కూడా అతనికి పడిపోయానని అంటోంది.

పరిణీతి చోప్రా
హీరోయిన్ పరిణీతి చోప్రాకు నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అంటే తెగ ఇష్టమట. అవకాశం వస్తే అతన్ని పెళ్లి కూడా చేసుకుంటానంటోంది.

ఆదిత్యారాయ్ కపూర్
బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్‌కు...బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ అంటే తెగ మోజట. ఒకసారి ఆమెను కలిసినప్పుడు ‘నన్ను పెళ్లి చేసుకుంటావా' అని కూడా అడిగాడట.

అర్జున్ కపూర్
ఇక మరో బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌కు...కరీనా కపూర్ అంటే తెగ మోజు. ఆమె చాలా అందంగా ఉంటుంది, మేకప్ లేకుండా మరింత బాగుంటుంది అని పొగిడేస్తున్నాడు.

ఇమ్రాన్ ఖాన్
మరో బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ మాత్రం తనకు అలనాటి హీరోయిన్ జుహి చావ్లా అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. కేవలం జుహీ చావ్లాను చూసేందుకే ఆమె నటించిన ప్రతి సినిమా చూసేవాడిని అంటున్నాడు.

ఆయుష్మాన్ ఖురానా
యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోయిన్ ప్రీతి జింతా అంటే ఇష్టమని చెబుతున్నాడు. ఆమె అందం, ఆటిట్యూడ్ నన్ను కట్టి పడేస్తుంది అని అంటున్నాడు.

సల్మాన్ ఖాన్
ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని అంటే ఇష్టమని చెబుతున్నాడు. తన జీవితంలో తొలిసారి ఇష్టపడ్డ మగువ ఆమెనే అని అంటున్నాడు.

చిత్రాంగద సింగ్
హాట్ బ్యూటీ చిత్రాంగద సింగ్ మాత్రం తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని చెబుతోంది. కాలేజీ రోజుల నుండే అతనంటే ఇష్టం. షారుక్ నటించిన ప్రతి సినిమాను మిస్సవకుండా చూసేదాన్ని అని అంటోంది.

సోనాక్షి సిన్హా
ఇక హీరోయిన్ సోనాక్షి సిన్హాకు మాత్రం బాలీవుడ్ హ్యాండ్సమ్ హృతిక్ రోషన్ అంటే ఇష్టమట.


Click it and Unblock the Notifications











