twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సువల్ క్రైం కేసుల్లో సినీ స్టార్స్ వీరే (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై: దేశంలో రోజు రోజుకు సెక్సువల్ క్రైం కేసులు పెరిగి పోతున్నాయనే విషయం మనం రోజూ టీవీల్లో, పేపర్లలో వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు వీటిని అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా జరిగేవి జరుగతూనే ఉన్నాయి. సెక్సువల్ క్రైం కేసుల్లో కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు.... రాజకీయ నాయకులు, సినిమా తారలు కూడా ఉంటున్నారు.

    పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటి వరకు సెక్సువల్ క్రైం కేసుల్లో ఇరుక్కున్నారు. కొందరు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్న ఇర్ఫాన్ ఖాన్ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు సెక్సువల్ క్రైం ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.

    ఆయనతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్, శక్తి కపూర్, షైనా ఆహుజా, ఆదిత్య పంచోలి లాంటి వారు సెక్స్‌వల్ క్రైం ఆరోపణలు ఎదుర్కొని వార్తల్లోకి ఎక్కారు. వారికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

    ఇంద్రకుమార్

    ఇంద్రకుమార్

    బాలీవుడ్ సెలబ్రిటీ ఇంద్రకుమార్‌పై రేప్ ఆరోపణలు వచ్చాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇంద్రకుమార్ తనను ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసాడని ఓ మోడల్ ఆరోపించింది. అయితే ఇంద్రకుమార్ భార్య వాదన మరో విధంగా ఉంది. ఏది ఏమైనా ఈ కేసులో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.

    ఇర్ఫాన్ ఖాన్

    ఇర్ఫాన్ ఖాన్

    పాన్ సింగ్ తోమర్ అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించిన మమతా పటేల్....ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌పై సెక్సువల్ క్రైం ఆరోపణలు చేసింది.

    శక్తి కపూర్

    శక్తి కపూర్

    బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ సెక్సువల్ క్రైంకు పాల్పడినట్లు ఓ ప్రైవేట్ ఛానల్ ఇన్వెస్టిగేటివ్‌లో తేలినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

    షైనీ ఆహుజా

    షైనీ ఆహుజా

    ప్రముఖ బాలీవుడ్ నటుడు షైనీ ఆహుజా పని మనిషి మీద అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లాడు. అయితే తర్వాత పని మనిషి అతనిపై కేసు వాపస్ తీసుకుంది.

    ఆదిత్య పంచోలి

    ఆదిత్య పంచోలి

    బాలీవుడ్ చిత్రాల్లో నటించడంతో పాటు, తెలుగులో కూడా పలు చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆదిత్య పంచోలి కూడా సెక్సువల్ క్రైం ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఉన్నారు.

    అమన్ వర్మ

    అమన్ వర్మ

    మరో బాలీవుడ్ సెలబ్రిటీ అమన్ వర్మపై కూడా సెక్సువల్ క్రైం ఆరోపణలు ఉన్నాయి.

    జాకీ ష్రాఫ్

    జాకీ ష్రాఫ్

    ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌పై బాలీవుడ్ నటి టబు ఆరోపణలు చేసింది. షూటింగ్ సమయంలో ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపించింది.

    English summary
    With the recent case of Inder Kumar, we would like to talk about celebrities who have been accused of sexual crime. A lot of famous and talented celebrities who are almost seen in many movies, parties and events have been accused of sexual crime from casting couch accusations to molestation charges.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X