ఈ స్టార్స్ కండోమ్ యాడ్స్ చేయాల్సిన అవసరం ఉంది
హైదరాబాద్: సినిమాల్లో బాగా పేరు వచ్చిన స్టార్స్ వెంట పలు కార్పొరేట్ సంస్థలు పడటం మామూలే. కోట్లు ఆఫర్ చేస్తుండటంతో ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సదరు వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. అయితే కండోమ్ యాడ్స్ విషయం వచ్చే సరికి మాత్రం చాలా మంది స్టార్స్ ముందుకు రావడం లేదు. పెద్దగా పేరు లేని క్రింది స్థాయి నటులు మాత్రమే ఇలాంటి యాడ్స్‌కు దిక్కవుతున్నారు. అయితే ఇటీవలే బాలీవుడ్లో మెయిన్ స్ట్రీమ్ యాక్టర్, యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణవీర్ సింగ్ ‘డూరెక్స్' కండోమ్ యాడ్లో నటించి సరికొత్త ట్రెండుకు నాంది పలికాడు. నటి సన్నీ లియోన్ కూడా ‘మ్యాన్ ఫోర్స్' కండోమ్ యాడ్లో నటించింది.
కండోమ్ యాడ్స్ అంటేనే....శృంగార భరితంగా ఉంటాయి. అయితే వాటిని వాడకం పెంచడానికి హాట్ హాట్‌గా వాటిని చిత్రీకరించడం తప్పేమీ కాదనేది సదరు కంపెనీల వాదన. అయితే కండోమ్ వాడకం ఎంత పెరిగితే అంత మంచి జరుగుతుంది సమాజానికి అంటున్నారు. హెచ్.ఐ.వి ఎయిడ్స్, ఇతర సుఖ వ్యాధులు వ్యాపించకుండా ఉండటానికి కండోమ్ వాడకం తప్పని సరి. అవాంచిత గర్భం రాకుండా ఉండేందుకు కండోమ్‌ను మించిన సురక్షిత మార్గం మరొకటి లేదు.
అయితే కండోమ్ వాడకం పెంచడానికి స్టార్ హీరోలు రంగంలోకి దిగితే ఫలితాలు మరింత బావుంటాయని అంటున్నారు విశ్లేషకులు. దురదృష్ట వశాత్తు మన దేశంలోని స్టార్స్ ఇలాంటివి చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే మన దేశంలో ‘సెక్స్' అనే అంశం ఒక నిశిద్ధ అంశంగానే సాధారణ ప్రజల్లో పరిగణించబడుతోంది. ఎవరూ ‘సెక్స్' గురించి బహిరంగంగా మాట్లాడానికి ఇష్టపడని పరిస్థితులు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి. తమ ఇమేజ్ దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో కండోమ్ యాడ్స్ చేయడానికి స్టార్ హీరోలు ఇష్ట పడక పోవడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.
‘సెక్స్' పరమైన అంశాల్లో నిశ్శబ్ధాన్ని చేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కండోమ్స్ వాడకం, సురక్షితమైన శృంగారం గురించి ప్రజల్లో అవగాహన పెరిగినపుడే హెచ్ఐవి ఎయిడ్స్, సుఖ వ్యాధులు లాంటిని అరికట్టడానికి వీలవుతుందనేది నిపుణుల అభిప్రాయం. మనదేశంలో ఎయిడ్స్, సుఖవ్యాధులు వ్యాపించడానికి కండోమ్ వాడకం సరిగా లేక పోవడమే అని పలు అధ్యయనాల్లో తేలింది.
ఆ మధ్య రణవీర్ కపూర్ లాంటి స్టార్ హీరో కండోమ్ యాడ్లో నటించగానే...మీడియా ఫోకస్ అంతా అతని వైపు మళ్లింది. అయితే అతను ఏ మాత్రం బెరవకుండా...కండోమ్ వాడకం పెంచడం అంటే మంచి పని చేయడమే, హెచ్ఐవి ఎయిడ్స్, ఇతర సుఖ వ్యాధులు నిరోధించడంలో కండోమ్స్ కీలకం అని ధైర్యంగా చెప్పాడు. రణవీర్ సింగ్ దారిలోనే ఇతర స్టార్స్ నడవాల్సిన అసవరం ఉందనే వాదన వినిపిస్తోంది.

రణవీర్ సింగ్
కండోమ్ యాడ్లో నటించిన మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ రణవీర్ సింగ్. డూరెక్స్ కండోమ్ యాడ్లో నటించాడు.

సన్నీ లియోన్
సన్నీ లియోన్ మ్యాన్ ఫోర్స్ యాడ్లో నటించి కండోమ్ వాడకం పెంచడంలో తన వంతు బాధ్య నిర్వర్తించింది.

పూనమ్ పాండే
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే కూడా రణవీర్ సింగ్ లా తాను కూడా కండోమ్ యాడ్లో నటించడానికి సిద్దమే అని ప్రకటించింది.

సల్మాన్ ఖాన్
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కండోమ్ యాడ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

రణబీర్ కపూర్
రణబీర్ కపూర్ లాంటి సెక్స్ అప్పీల్ ఉన్న యంగ్ స్టార్స్ కండోమ్ యాడ్స్ చేస్తే యువతపై మంచి ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

హృతిక్ రోషన్
బాలీవుడ్ గుడ్ లుకింగ్ హీరోల్లో హృతిక్ రోషన్ స్తానం ప్రత్యేకం. ఆయన కండోమ్ యాడ్స్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

షెర్లిన్ చోప్రా
బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా లాంటి వారు కండోమ్ యాడ్లో నటిస్తే వాటికి పబ్లిసిటీ బాగా వస్తుంది.

ఇమ్రాన్ హస్మి
శృంగార సీన్లు, కిస్సింగ్ సీన్లలో ఇమ్రాన్ హస్మి దిట్ట. అతను కండోమ్ యాడ్ చేసినా మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

మనారా..
బాలీవుడ్ హీరోయిన్ మనారా తొలి సినిమాతోనే సెక్స్ అపీల్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమ్ముడు ఈ యాడ్ చేసినా బావుంటుందని అంటున్నారు.

అర్జున్ రాంపాల్
అర్జున్ రాంపాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కండోమ్ యాడ్స్ చేస్తే ఫలితాలు బావుంటాయిన అంటున్నారు.


Click it and Unblock the Notifications











