అపుడు లవర్స్, ఇపుడు శత్రువులు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఈ తరం సినిమా తారల మధ్య ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాలు, డేటింగులు, చాటింగులు సర్వ సాధారణం. ఇష్టం ఉన్నన్ని రోజులు కలిసి ఉండటం, కలిసి లైఫ్ ఎంజాయ్ చేయడం...ఆ తర్వాత బోర్ కొట్టి వారిని ఎలాగో అలా వదిలించుకోవడం. అనంతరం మరొకరితో ఫ్రెష్‌గా వ్యవహారం మొదలు పెట్టడం అనేది నయా ట్రెండ్.
నీ ఇష్టం ఉన్నట్లు నువ్వు ఉండు...మరొకరి కోసం త్యాగం చేయాల్సిన, సర్దుకు పోవాల్సిన అవసరం నీకేంటి? వీలైనంత వరకు లైఫ్‌ను ఆస్వాదించు. నచ్చినన్ని రోజులు కలిసి ఉండు, బోర్ కొట్టిన వెంటనే హ్యాండిచ్చేయ్ అనే కాన్సెప్టును చాలా మంది సినిమా స్టార్లు ఫాలో అవుతున్నారు.
అయితే ప్రేమికులుగా విడిపోయిన తర్వాత కూడా కొందరు స్నేహితుల్లా కలిసి పోతే......కొందరు మాత్రం శతృవులుగా మిగిలిపోయారు. శతృత్వం కంటిన్యూ చేస్తున్న వారు గతంలో ఘాడమైన ప్రేమబంధంలో మునిగితేలిన వారే కావడం గమనార్హం. అందుకు చక్కటి ఉదాహరణ సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్.
అప్పట్లో సల్మాన్, ఐశ్వర్య ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెలుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు శతృత్వానికి దారి తీసింది. ఐశ్వర్యతో బ్రేకప్ తర్వాత సల్మాన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. సల్మాన్-ఐశ్వర్య మాదిరి.....ప్రేమికుల నుండి శత్రువులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.
వారి వివరాలు స్లైడ్ షోలో...

సల్మాన్-ఐశ్వర్య
బాలీవుడ్ చరిత్రలో సల్మాన్-ఐశ్వర్యరాయ్ వ్యవహారం ఎప్పటికీ చెరిగిపోదేమో. ఇద్దరు ఒకప్పుడు గాఢమైన ప్రేమికులు. ఏమైందో ఏమో? ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. సల్మాన్ తనను శారీరకంగా హింసించాడనే ఆరోపణలు చేసింది ఐశ్వర్య. ఈ ప్రేమ వ్యవహారం ఇద్దరి జీవితాల్లోనూ పీడకలలా మిగిలిపోయింది.

ప్రీతీ జింతా-నెస్ వాడియా
ప్రీతి జింతా, నెస్ వాడియా ఒకప్పుడు ప్రేమికులు. ఇద్దరు పంజాబ్ ఐపీఎల్ టీం ఫ్రాంచైజీలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. అయితే ఇద్దరూ విడిపోయారు. ఇపుడు ఒకరంటే ఒకరికి పడనంత శతృత్వం ఇద్దరి మధ్య ఉంది.

అభిషేక్ బచ్చన్-కరిష్మా కపూర్
బాలీవుడ్ స్టార్స్ కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఎందుకనో విడిపోయారు. అప్పటి నుండి అభిషేక్, కరిష్మాలకు అస్సలు మాట్లాడుకోవడం లేదు.

అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి
బాలీవుడ్ స్టార్స్ శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్ మధ్య అప్పట్లో ఘాడమైన ప్రేమాయణం సాగింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో విడిపోయారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య శతృత్వం నెలకొంది.

షాహిద్ కపూర్, కరీనా కపూర్
షాహిద్ కపూర్, కరీనా కపూర్ మధ్య ఎఫైర్ అప్పట్లో ఏ రేంజిలో సాగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరి రొమాన్స్ ఎంఎంఎస్ రూపంలో లీక్ అయ్యాయి. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇపుడు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు.

సుస్మితా సేన్-రణదీప్ హుడా
సుస్మితా సేన్ ఇప్పటి వరకు చాలా మందితో ఎఫైర్లు నడిపింది. అయితే రణదీప్ హుడాతో ఆమె ఎపైర్ అప్పట్లో హాట్ టాపిక్. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇపుడు ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోవడం లేదు.

వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యరాయ్
హీరోయిన్ ఐశ్వర్యారాయ్, వివేక్ ఒబెరాయ్ మధ్య కూడా ఘాడమైన ప్రేమాయణం సాగింది. అయితే విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత దూరం పెరిగి పోయింది.

జాన్ అబ్రహం-బిపాసా
బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్రహం, బిపాసా బసు మధ్య లాంగ్ టైం ఎఫైర్ నడిచింది. బిపాసా తీరు నచ్చని జాన్ అబ్రహం ఆమెతో విడిపోయాడు. ప్రియా రాంచల్‌ను పెళ్లాడాడు. ఒకప్పుడు ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో ఇపుడు అంతకు మించిన శతృత్వం ఉంది.


Click it and Unblock the Notifications











