న్యూ ఇయర్: ఫుల్లుగా ఎంజాయ్ చేసిన సినీ స్టార్స్..(ఫోటోలు)
2014 న్యూ ఇయర్ వేడుకలను పలువురు సినీ తారలు ఎంతో జోష్‌గా జరుపుకున్నారు. ఎక్కువ మంది సెలబ్రిటీలు గోవాకు వెళ్లి ఎంజాయ్ చేస్తే...మరికొందరు మాల్దీవులు, ఇతర ప్రాంతాలకు వెకేషన్ వెళ్లారు. ఇందుకు సంబంధించని ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. వాటిపై లుక్కేద్దాం...
బాలీవుడ్ నటులు ఉదయ్ చోప్రా, నర్గీస్ ఫక్రి మధ్య ఎఫైర్ ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఇద్దరూ మాల్దీవుల్లో దర్శనం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి స్విమ్ సూట్లలో సముద్రం ఒడ్డున జలకాలాడారు. ఇక సన్ని లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో వేడుక జరుపుకుంది.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, బిపాసా బసు, నటు హర్మాన్, వీజె ఆండీ, బిగ్ బాస్ విజేత గుహర్ ఖాన్, కుషాల్ తదితరులు గోవాలో పార్టీలో మునిగి తేలారు. శ్రీదేవి తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో గడిపింది. అందుకు సంబంధించిన ఫోటోలు సైడ్ షోలో....

ఉదయ్ చోప్రా-నర్గీస్ ఫక్రి
ఉదయ్ చోప్రా-నర్గీస్ ఫక్రి మధ్య ఎఫైర్ ఉన్నట్లు గత కొంతకాలంగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ......న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఇద్దరు మాల్దీవుల్లో ఇలా హాలిడే ఎంజాయ్ చేసారు.

సన్నీ లియోన్
పోర్న్ తార సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో న్యూ ఇయర్ వేడుక జరుపుకుంది. భర్తను ముద్దాడుతున్న సన్నీలియోన్‌ను ఇక్కడ చూడొచ్చు.

సోనమ్ కపూర్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ గోవాలో న్యూఇయర్ వేడుకలను ఎంజాయ్ చేసింది.

బిపాసా బసు
బిపాస బసు, నటుడు హర్మాన్, విజె ఆండీ గోవాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

గుహర్ ఖాన్
బిగ్ బాస్ 7 విజేత గుహర్ ఖాన్, కుషాల్ గోవాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసారు.

శ్రీదేవి
హీరోయిన్ శ్రీదేవి, బోనీ కపూర్....వారి ఇద్దరు కూతుర్లు మాల్దీవుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.


Click it and Unblock the Notifications











