»   »  ‘బాహుబలి’కి బాలీవుడ్ కూడా బ్రహ్మరథం

‘బాహుబలి’కి బాలీవుడ్ కూడా బ్రహ్మరథం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మళయాలంలో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ప్రెస్ కోసం ఒక రోజు ముందుగానే స్పెషల్ షో వేసారు. పలువురు బాలీవుడ్ సినీ విశ్లేషకులు బాహుబలిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Bollywood celebs praises Bahubali

తరణ్ ఆదర్శ్, బాలీవుడ్ సినీ విశ్లేషకుడు..
బాహుబలి సినిమాలోని ప్రతిఫ్రేమ్ మాస్టర్ పీస్‌లా ఉంది, రాజమౌళి పని తీరు అద్భుతం, హాలీవుడ్ సినిమాల స్థాయిలో బాహుబలి ఉంది. రాజమౌళి జీనియస్. సినిమా కోసం వేసిన సెట్లు, విఎఫ్ఎక్స్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ముక్యంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. తారాగణం అద్భుతం. ఎవరికి వారు తమ తమ పాత్రల్లో మెరిసిపోయారు. రానా, ప్రభాస్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. బాహుబలి లాంటి సినిమా భారతీయులకు గర్వకారణం. బాహుబలి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. బాక్సాఫీసు వద్ద ఇది బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. ఇదొక రిమెంబర్డ్ క్లాసిక్.


మరో వైపు హిందీ వెర్షన్ కు సంబంధించిన అక్కడ ప్రీమియర్ షో చూసిన వారంతా సినిమా అద్భుతంగా ఉందని, పైసా వసూలు సినిమా అని, బ్లాక్ బస్టర్ హిట్ అని పొగడ్తలు గుప్పిస్తున్నారు. ప్రభాస్, రానా పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి డైరెక్షన్ అద్భుతం అంటున్నారంతా. అయితే బాలీవుడ్ ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది.
English summary
Bollywood critics shared their verdicts on the Baahubali film. We bring you some unique comments. Here is the live update of 'Baahubali' movie review by Bollywood critics
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu