»   » రెమ్యూనరేషన్లో టాప్- 10 సినీ స్టార్స్ వీరే... (ఫోటో ఫీచర్)

రెమ్యూనరేషన్లో టాప్- 10 సినీ స్టార్స్ వీరే... (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సినిమాలు ఈ మధ్య వసూళ్ల పరంగా భారీ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా అయినా సరే హిట్టయితే ఈజీగా రూ. 100 కోట్లు వసూలు చేస్తోంది. ఇక స్టార్ హీరోల సినిమాలైతే దాదాపు 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ నటుల పారితోషికం కూడా ఎక్కువగానే ఉంటోంది.

బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్....స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా పారితోషికాలు చుక్కలను అంటున్నాయి. బాలీవుడ్లో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 హీరో హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో...

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్


వరుస విజయాలతో దూసుకెలుతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ ఒక్కో సినిమాకు రూ. 8 నుండి 9 కోట్లు తీసుకుంటోంది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


దబాంగ్, ఏక్ థా టైగర్ లాంటి వరుస విజయాలతో సల్మాన్ పారితోషికం ఒక్కో సినిమాకు రూ. 55 కోట్లు తీసుకునే వరకు వెళ్లింది.

కరీనా కపూర్

కరీనా కపూర్


బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్ ఒక్కో సినిమాకు రూ. 8 నుండి 8.5 కోట్లు తీసుకుంటోంది.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్


షారుక్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ. 35 కోట్లు తీసుకుంటున్నాడని అంటున్నారు. సినిమా లాభాలను భట్టి వాటా కూడా తీసుకుంటాడట.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల నుండి 6.5 కోట్లు తీసుకుంటోంది, దీంతో పాటు వ్యాపార ప్రకటన ద్వారా కూడా కోట్లు వెనకేస్తోందని అంటున్నారు. ఒక్కో యాడ్‌కు 1.5 కోట్లు తీసుకుంటోందట.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా


బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు రూ. 7 నుండి 8 కోట్లు తీసుకుంటోంది.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్


మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఒపుడు ఒక్కో సినిమాకు రూ. 45 కోట్లు తీసుకుంటున్నాడు. గత సంవత్సరం అక్షయ్ కుమార్ అత్యధికంగా రూ. 18 కోట్లు టాక్స్ చెల్లించాడు.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్


మరో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ. 40 కోట్లు తీసుకుంటున్నాడు.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్


బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు రూ. 20 నుండి 24 కోట్లు తీసుకుంటున్నాడని అంచనా.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్


బాలీవుడ్ స్టైలిష్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ ఒక్కో సినిమాకు 20 కోట్లకు పైగా పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడట.

English summary
Check out Bollywood celebs remunaration list. We bring you a list of the top 10 highest paid actors in Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu