మరో ముగ్గురు డైరక్టర్స్ కి హిందీ ఛాన్స్
ప్రభుదేవా,పూరీ జగన్నాధ్ హిందీలో విజయవంతమైన సినిమాలు రూపొందించేసరికి ఇక్కడ చాలా మంది దర్శకులకు అక్కడ మార్కెట్ పై కన్ను పడింది.అదే కోవలో మరో ముగ్గురు దర్శకులు హిందీలోకి ప్రయాణం పెట్టుకోవటానకి రెడీగా ఉన్నారు. వాళ్ళు శేఖర్ కమ్ముల, సుకుమార్, జయంత్.ఈ విషయమై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ నా హ్యాపీడేస్ చిత్రం శేఖర్ కపూర్ కి బాగా నచ్చింది.ఆయన హిందిలో రీమేక్ చేయటానికి ఆ సక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం చర్చల దశల్లో ఉంది అన్నారు.
అలాగే సుకుమార్ తాజా హిట్ హండ్రెడ్ పర్శంట్ లవ్ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ ని గీతా ఆర్ట్స్ వారు అమ్మేసారు.అయితే సుకుమార్ ని సంప్రదించిన తర్వాతే దర్శకత్వం గురించి ఆలోచించాలని కండీషన్ పెట్టారు.సుకుమార్ ఖాళీ ఉంటే ఆ చిత్రం రీమేక్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు.ఇక జయింత్ పరాంన్జీ కి హిందీలో మంచి పట్టు ఉంది.ముంబై కి చెందిన హీరోయిన్స్ అంతా ఆయనకు పరిచయం.దాంతో ఓ హిందీ చిత్రాన్ని త్వరలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా రామ్ గోపాల్ వర్మ వేసిన బాటలోకి వీరంతా ప్రయాణం పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











