రేప్ కేసులో దర్శకుడు అరెస్టు!!
ఓ ప్రక్క బాలీవుడ్ షైనీ అహూజా పనిమనిషిని రేప్ చేసిన కేసుని మరిచిపోకముందే మరో రేప్ కేసు నమోదు అయింది. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఓ వర్థమాన తారను అత్యాచారం చేసిన కేసులో ఓ సినీ దర్శకుడు అరెస్టు అయ్యాడు. ముంబయిలోని సబర్బన్ వెర్సోవాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. రామ్‌కుమార్ కుమావత్ అనే డైరెక్టరు చిన్న చిన్న సినిమాలకు డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇతను కొత్తగా నిర్మించబోతున్న సినిమాకు కొత్త నటీనటుల కోసం నిర్వహించిన అడిషన్స్‌లో ఈ 24 ఏళ్ల బాధితురాలిని సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో కొన్ని రోజు తర్వాత ఆమె కుమావత్‌కు ఫోన్ చేయగా తన ఆఫీసుకు రావాలని చెప్పాడు. కుమావత్ ఆఫీసుకు వెళ్లిన ఆ వర్థమాన నటిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమావత్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అతడిని కోర్టుకు హాజరుపరచగా రిమాండు విధించినట్లు చెప్పారు. అలాగే బాధితురాలనిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











