సౌదీలో సల్మాన్ఖాన్ సినిమాపై నిషేధం!

ప్రేక్షకుల నుంచి లెక్కకుమించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో గత శుక్రవారం విడుదలైన ఆ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించరాదని యుఎఇ జాతీయ ప్రసార సంస్థ ఆదేశించినట్లు గల్ఫ్‌న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ తాజా చిత్రంలో సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా నటించగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు.
ఆ చిత్రం.. 2003లో జిమ్ కెర్రీ నటించిన 'బ్రూస్ అల్‌మైటీ" అన్న హాలివుడ్ చిత్రానికి రీమేక్. ఆ చిత్రంలో అరుణ్ ప్రజాపతి (సల్మాన్) తన కష్టాలన్నింటికీ కారణం నీవేనంటూ దైవాన్ని(అమితాబ్) నిందిస్తాడు. ఆ చిత్రాన్ని చూసిన వారంతా అమితాబ్ దేవునిగా నటించడం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు సౌదీ ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











