For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిల్ కే 35 లక్షలు!!

    By Staff
    |

    ఈ రోజు (శుక్రవారం) విడుదల కానున్న 'షార్ట్ కట్' సినిమా టైటిల్ కోసం చిత్ర నిర్మాత, నటుడు అనిల్ కపూర్ 35 లక్షల రూపాయలు చెల్లించారు. కొద్దికాలం క్రింతం ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనతో అనిల్ కపూర్ ను కలిసి స్క్రిప్టు అందజేశాననీ, ఆ సినిమాలో ఓ పాత్రను కూడా ఆయనకు ఆఫర్ చేశాననీ భుల్లార్ రెండు రోజుల క్రితమే కోర్టును ఆశ్రయించారు. 2005 సెప్టెంబర్ తాను 'షార్ట్ కట్' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాననీ, ఇప్పుడు ఆ టైటిల్ ను అనిల్ కపూర్ వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందనీ ఆయన కోర్టుకు తెలియజేశారు. ఈ విషయమై సమాధానం చెప్పాల్సిందిగా అనిల్ కపూర్ నిర్మాణ సంస్థకు కోర్టు మంగళవారంనాడు నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో తాను 35 లక్షల రూపాయలు పరిహారంగా భుల్లార్ కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని జస్టిస్ రేవ చత్రపాల్ ముందుకు అనిల్ కపూర్ గురువారంనాడు అంగీకరించారు.దీంతో షెడ్యూల్ ప్రకారం ఈనెల 10వ తేదీ శుక్రవారంనాడు 'షార్ట్ కట్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదగాలి.. అందుకు సరైన మార్గం ఎంచుకోవాలి. అంతేగానీ అడ్డదార్లు తొక్కితే ఫలితం తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు. వక్రమార్గాల్లో సిద్ధించింది ఏదీ కలకాలం నిలువదు. ఇలాంటి కథాంశంతోనే హిందీలో తెరకెక్కిన చిత్రం 'షార్ట్‌కట్‌'. నీరజ్‌ వోరా దర్శకుడు. అనిల్‌ కపూర్‌ నిర్మాత. అక్షయ్‌ ఖన్నా, అర్షద్‌ వార్సి, అమృతా రావు ప్రధాన పాత్రధారులు.సినిమా రంగం నేపథ్యంగా కథ నడుస్తుంది. చిత్రసీమలో ఎదగాలని బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు యువకుల కథే 'షార్ట్‌ కట్‌'. అమృతారావు హీరోయిన్ పాత్రలో నటించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X