twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీ యాక్క్..! అన్నారు: బాహుబలి తర్వాత ఇప్పటికి మొదటి హిట్ ఇదే

    నిజానికి హిట్ అన్నమాట బాలీవుడ్ లో బాహుబలి 2 తర్వాత వినిపించనే లేదు ఇప్పుడు ఆ చింత టాయిలెట్ తో తీరి పోయింది

    |

    టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా పేరు వినగానే చాలామంది సోషల్ అవేర్నెస్ సినిమా అనుకున్నా సరే కాస్త ఎబ్బెట్టుగా మొహం పెట్టారు. మరీ ఇంత "ఇదిగా" టైటిల్ పెట్టకుంటే ఏంపోయిందీ అంటూ అక్షయ్నే అడిగారట. ఇంకొందరైతే నువ్వు మరీ బీ గ్రేడ్ హీరోవి కాదు సందేశాలివ్వటానికి చాలా సబ్జెక్ట్లున్నాయి మళ్ళీ ఆలోచించుకో అని సలహాలు కూడా ఇచ్చారట.

    కానీ అక్షయ్ కుమార్ సందేశాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో తన స్టార్ ఇమేజ్ ను కూడా లెక్క చేయడని మరోసారి రుజువైంది. "టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథా" సినిమా అందరి మన్ననలను అందుకొని 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ను దాటుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అందరిలో ఆసక్తిని రేపింది. దేశంలో బహిర్భూమికి వెళ్లే వారి కష్టాల గురించి అలాగే స్త్రీలు ఎదుర్కునే అవమానాల గురించి చెబుతూ.. తీసిన ఈ సినిమాతో చిత్ర యూనిట్ సక్సెస్ ను అందుకుంది. నిజానికి హిట్ అన్నమాట బాలీవుడ్ లో బాహుబలి 2 తర్వాత వినిపించనే లేదు ఇప్పుడు ఆ చింత టాయిలెట్ తో తీరి పోయింది.

    Bollywood has got a Much Needed hit

    అయితే చిత్రం గురించి మొదట కొంత విమర్శలు వచ్చాయట. ప్రభుత్వం కోసమే అక్షయ్ ఈ సినిమా ద్వారా ప్రచారం చేస్తున్నాడని చెప్పినవారే ఇప్పుడు థియేటర్లో విజిల్స్ వేస్తున్నారని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమాధానాన్ని ఇచ్చాడు అక్షయ్. అలాగే దేశంలో ఈ సినిమా ఒక మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. గత ఎనిమిది నెలలుగా బహిర్భూమికి వెళ్లేవారి సంఖ్యా 54% నుంచి 34% వరకు వచ్చిందని. ఇప్పుడు ఆ 34 శాతం కూడా ఈ సినిమా ద్వారా సున్నాకి చేరాలని చెప్పాడు.

    ఇక ఈ సినిమా హిట్ అయినా కాకపోయినా బహిర్భూమి అనే అంశం వల్ల కలిగే ఇబ్బందులను ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుందని అనుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదలు తెలిపాడు. ప్రస్తుతం అక్షయ్ ప్యాడ్ మ్యాన్ - గోల్డ్ చిత్రాలతో పాటు రజినీకాంత్ 2.0 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

    English summary
    Akshay Kumar and Bhumi Pednekar starrer ?Toilet Ek Prem Katha? has raked in INR 51.45 crore net approx over its first weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X