Sharukh Khan Injured: షారుక్‌కు సర్జరీ.. షూటింగ్లో ప్రమాదం.. ఇప్పుడెలా ఉందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మూవీ షూటింగులో పాల్గొన్న షార్.. సెట్స్ లో ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి. ముక్కుకు గాయం కావడంతో.. రక్త స్రావం కూడా అయిందని సమాచారం. ఇక షారుఖ్ ఖాన్ కు చిన్నపాటి సర్జరీ కూడా చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
యూత్ లో మంచిక్రేజ్...:బాలీవుడ్ స్టోర్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరో అయినా... సౌత్ వారికి పరిచయమే. ఆయన చిత్రాలు డబ్బింగ్ అవుతూ.. ఆ కాలం నుంచే ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఎన్నో ప్రేమకథ చిత్రాలు, యాక్షన్ చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపును పొందాడు షారుఖ్ ఖాన్. ఈ హీరోకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే... ఎంతో ఆతృతగా ఎదురూ చూస్తుంటారు.

పఠాన్ తో పూర్వ వైభవం:బాలీవుడ్ కరోనా తర్వాత కష్టకాలంలో పడిపోయింది. సరైనా హిట్ లేక అల్లాడిపోతున్న సమయంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులు బ్రేక్ చేశాడు కింగ్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. బాహుబలి, కేజీఎప్2, ఆర్ఆర్ఆర్ రికార్డులను పఠాన్ కొల్లగొట్టాడు. పఠాన్ హిట్ తో షారుక్ ఖాన్ ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు యాక్సిడెంట్ అయింది.
షూటింగ్లో ప్రమాదం...:అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా షారుక్ ఖాన్ కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని తెలుస్తోంది. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారని సమాచారం. దీంతో షారుక్.. ప్రస్తుతం భారత్‌కు తిరిగి వచ్చారని.. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అంటున్నారు. ఆపరేషన్ తర్వాత షారుక్ ముక్కుకు కట్టుతో కనిపించాడని సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఇప్పుడు ముంబైలోని తన ఇంటికి తిరిగి వచ్చారని.. కోలుకుంటున్నారని తెలుస్తోంది.

షారుక్ రెండు సినిమాల్లో...:ఇకపోతే ప్రస్తుతం షారుక్.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జవాన్ అని పేరు పెట్టారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార నటిస్తోంది. ఇంకా మూవీలో విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో డంకీలోనూ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











