twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో వరుణ్ ధావన్ పెళ్లి.. ఎప్పుడైనా ఆమెతోనే నా జీవితం అంటూ..

    |

    బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా విడుదలైన కళంక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వ్యక్తిగత విషయానికి వస్తే ఈ మధ్య పెళ్లి వార్తల మధ్య హీరో వరుణ్ ధావన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. గత కొద్దికాలంగా నటాషా దలాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ యువ నటుడు.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. ఇంతకు వరుణ్ ఏమన్నారంటే..

    ప్రేయసి నటాషాతో వివాహం గురించి

    ప్రేయసి నటాషాతో వివాహం గురించి

    తన ప్రియురాలు నటాషాతో డిసెంబర్‌లో పెళ్లి.. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో విస్త్రృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే వరుణ్ పెళ్లి వార్తలపై ఆయన తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ స్పందించారు. వచ్చే ఏడాది వరుణ్ పెళ్లి జరిగే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు.

    వచ్చే ఏడాది నా పెళ్లి

    వచ్చే ఏడాది నా పెళ్లి

    తన తండ్రి డేవిడ్ ధావన్ స్పందనపై వరుణ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నా పెళ్లి జరగొచ్చు. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నాను. నా తండ్రి నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. నా తండ్రి ఆకాంక్షలకు ఎప్పుడూ లోబడి ఉంటాను. నా అభిప్రాయాలను నా తల్లిదండ్రులు గౌరవిస్తారు అని అన్నారు.

    నటాషా దలాల్ ఎందుకు ఇష్టమంటే

    నటాషా దలాల్ ఎందుకు ఇష్టమంటే

    వరుణ్ ధావన్ ఇటీవల కరణ్ జోహర్ షోలో మాట్లాడుతూ.. నా ఆలోచనలు ఎప్పుడూ నటాషాతోనే ఉంటాయి. స్వతంత్రంగా ఉండే ఆమె తీరు నాకు బాగా నచ్చుతుంది. ఏదైనా విషయంపై తన అభిప్రాయాన్ని కచ్చితంగా, స్పష్టంగా చెబుతుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపన చూస్తే మరీ ఇష్టం అని తెలిపారు.

     కూలీ నంబర్ 1 హిందీ రీమేక్‌లో

    కూలీ నంబర్ 1 హిందీ రీమేక్‌లో

    కరణ్ జోహర్ రూపొందించిన కళంక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని పొందింది. అలియాభట్‌తో కలిసి వరుణ్ ధావన్ నటించాడు. కళంక్ చిత్రం తర్వాత ప్రస్తుతం స్టీట్ డ్యాన్సర్ 3డీ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే తెలుగులో ఘనవిజయం సాధించిన కూలీ నంబర్ 1 చిత్రం రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

    English summary
    Actor Varun Dhawan has been dating Natasha Dalal for many years now. The two are childhood sweethearts. Varun said, "I’m with her (Natasha) because she has her own individuality, she has her own voice which is super strong with things she wants to do and things she wants to achieve in life."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X