Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరో వరుణ్ ధావన్ పెళ్లి.. ఎప్పుడైనా ఆమెతోనే నా జీవితం అంటూ..
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా విడుదలైన కళంక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వ్యక్తిగత విషయానికి వస్తే ఈ మధ్య పెళ్లి వార్తల మధ్య హీరో వరుణ్ ధావన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. గత కొద్దికాలంగా నటాషా దలాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ యువ నటుడు.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. ఇంతకు వరుణ్ ఏమన్నారంటే..
ప్రేయసి నటాషాతో వివాహం గురించి
తన ప్రియురాలు నటాషాతో డిసెంబర్లో పెళ్లి.. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో విస్త్రృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే వరుణ్ పెళ్లి వార్తలపై ఆయన తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ స్పందించారు. వచ్చే ఏడాది వరుణ్ పెళ్లి జరిగే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు.
వచ్చే ఏడాది నా పెళ్లి
తన తండ్రి డేవిడ్ ధావన్ స్పందనపై వరుణ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నా పెళ్లి జరగొచ్చు. ప్రస్తుతం రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నాను. నా తండ్రి నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. నా తండ్రి ఆకాంక్షలకు ఎప్పుడూ లోబడి ఉంటాను. నా అభిప్రాయాలను నా తల్లిదండ్రులు గౌరవిస్తారు అని అన్నారు.
నటాషా దలాల్ ఎందుకు ఇష్టమంటే
వరుణ్ ధావన్ ఇటీవల కరణ్ జోహర్ షోలో మాట్లాడుతూ.. నా ఆలోచనలు ఎప్పుడూ నటాషాతోనే ఉంటాయి. స్వతంత్రంగా ఉండే ఆమె తీరు నాకు బాగా నచ్చుతుంది. ఏదైనా విషయంపై తన అభిప్రాయాన్ని కచ్చితంగా, స్పష్టంగా చెబుతుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపన చూస్తే మరీ ఇష్టం అని తెలిపారు.
కూలీ నంబర్ 1 హిందీ రీమేక్‌లో
కరణ్ జోహర్ రూపొందించిన కళంక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని పొందింది. అలియాభట్‌తో కలిసి వరుణ్ ధావన్ నటించాడు. కళంక్ చిత్రం తర్వాత ప్రస్తుతం స్టీట్ డ్యాన్సర్ 3డీ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే తెలుగులో ఘనవిజయం సాధించిన కూలీ నంబర్ 1 చిత్రం రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు.