For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్ళు చేస్తే బోల్డ్ మేం చేస్తే అశ్లీలమా..? సెక్స్ సీన్లలో మేం నటించకూడదా?? (జరీన్ ఖాన్ ఫొటోలు)

  |

  బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి అమ్మడు నానా తంటాలు పడుతుంది జరీన్ ఖాన్. అయితే ఇన్నాళ్ళు ఎన్ని వేషాలు వేసిన బండి నడవలేదని, ఇప్పుడు కొత్త పద్దతి ఎంచుకున్నది ఈ అమ్మడు. ఒంటి మీద బట్టలు ఉన్నట్లుండి తగ్గించేసి.. నేను దేనికైనా రెడీ అని చెప్పకనే చెప్పేసిందిఈ చిన్న కత్రినా.

  నిన్నా మొన్నటివరకూ గ్లామర్ గా కనిపించింది కానీ మరీ ఓవర్ ఎక్స్ పోజింగ్ వైపు మళ్ళలేదు. కానీ ఇప్పుడు పొట్టి నిక్కరేసుకుని.. క్లీవేజ్ షో చేస్తూ.. ఓ షాకింగ్ అవతారంలో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది జరీన్. సెగలు రేపుతున్న ఈ అవతారం ఆమెకు కచ్చితంగా అవకాశాలు తెచ్చిపెట్టేలాగే ఉంది.

  తాజాగా టీ సిరీస్ 'ప్యార్ మాంగా హై' పేరుతో ఆరున్నర నిమిషాల వీడియో ఆల్బమ్‌ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియలో ఈ ట్రైలర్ హల్ చల్ చేస్తుంది. హాట్ హాట్ సీన్లతో రూపొందించిన ఈ వీడియోలో జరీన్ విశ్వరూపమే చూపించేసింది. మరీ రెచ్చిపోయినట్టున్న ఈ వీడియో మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.... ఈ మధ్య జరీన్ అందాల ఆరబోతమీద వచ్చిన విమర్శల విషయం లో బాగానే హర్టయిన ఈ భామ గట్టిగానే జవాబిచ్చింది... ఇంతకీ జరీన్ ఏమందంటే....

  బోల్డ్ సన్నివేశాలు:

  బోల్డ్ సన్నివేశాలు:

  మామూలుగా పెద్ద సినిమాలలో, అగ్ర తారల సినిమాల్లో కనిపించే అశ్లీలతను బోల్డ్ సన్నివేశాలంటుంటాయి సినీ వర్గాలు.

  అలా ఎందుక్లు?:

  అలా ఎందుక్లు?:

  వాటి ద్వారానే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి సన్నివేశాల్లో పెద్ద హీరోయిన్లు నటిస్తే మెచ్చుకుని, పేరులేని చిన్న తారలు నటిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తోంది జరీన్.

  పెద్దగా అవకాశాల్లేవు:

  పెద్దగా అవకాశాల్లేవు:

  సల్మాన్ వీర్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. వీర్ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సల్మాన్ సలహాతో ‘హేట్‌స్టోరీ-3'లో నటించిందామె.

  హేట్‌స్టోరీ-3:

  హేట్‌స్టోరీ-3:

  హేట్ స్టోరీ 3 లోని రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయి నటించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.

  విమర్శలు:

  విమర్శలు:

  అలాంటి సన్నివేశాలపై కొందరు విమర్శలు చేస్తుంటారు. వాటిపై స్పందించిన జరీన్ సమాధానం మాత్రం గట్టిగానే ఇచ్చింది. నిజాలని సరిగా చూడండంటూ తిరగబడి ఏకి పారేసింది.

  వాళ్ళు చేస్తే ఓకేనా?:

  వాళ్ళు చేస్తే ఓకేనా?:

  ‘‘వాటిలో పాపులారిటీ ఉన్న తారలు నటిస్తే చెల్లుతుంది. చాలా బాగా చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అద్భుతం, అందంగా కనిపించావంటుంటారు.

  అశ్లీలత మాదేనా?:

  అశ్లీలత మాదేనా?:

  అదే పాపులారిటీ లేని వారు నటిస్తే ఎక్కడలేని అశ్లీలత గుర్తొస్తుంది. వారిని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది తీరిదే. మరి వాళ్ల విషయంలో ఒకలా.. వేరొకరి విషయంలో మరొకలా ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాని విషయం.

  మొదటగా వాళ్ళే చూస్తారు:

  మొదటగా వాళ్ళే చూస్తారు:

  కానీ, ఇలాంటి సినిమాలను ఎక్కువగా చూసేది మాత్రం మొదట వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లే. అలాంటి వాళ్ల మాటలను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటా'' అని అసహనం వ్యక్తం చేసింది.

  తేల్చేసింది:

  తేల్చేసింది:

  అయినా జరీన్ అన్నదీ నిజమే కదా టూ పీస్ బికినీలో ఒక పెద్ద హీరోయిన్ కనిపిస్తే రాని విమర్శలు ఇలాంటి చిన్న తారల విశయం లోనే ఎందుకు అన్న జరీన్ ప్రశ్న కి సమాధానం వచ్చినా రాకున్నా తన ఆలోచన ఏమిటో మాత్రం చెప్పేసింది.

  English summary
  "Hate Story 3" Heroin junior Katrina Zareen khan fires on comments about her Body show....
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X