బాలీవుడ్ బ్యూటి అమృత అరోరా తన అందాలను తెలుగు వారికి త్వరలో పంచబోతోందిట. తరుణ్ హీరోగా రాజు హీర్వాణి నిర్మించనున్న సినిమాలో ఆమెని హీరోయిన్ గా అడిగారుట. ఆమె కూడా సరేనన్నట్లు తెలిసింది. కామిడీతో సాగే ఈ సినిమాకి ఇ.సత్తిబాబు దర్శకుడు. ఆయన గత చిత్రం 'వియ్యాలవారి కయ్యాలు' భాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాపు ని నమోదు చేయటంతో ఇప్పుడు పెద్ద హిట్టు కొట్టాలని కసితో స్కిప్టుని రూపొందించారని తెలుస్తోంది. అలాగే సుప్రీమ్ ఆడియో ఓనర్ అయిన నిర్మాత కూడా గతంలో విష్ణు వర్ధన్ బాబుతో 'అస్త్రం' సినిమాను రూపొందించారు. దాంతో ఆయన కూడా ఈ ప్రాజెక్టు తో హిట్టు కొట్టాలని యోచిస్తున్నారు. అందుకే హాట్ గా ఉండే అమృత అరోరాని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.