Akhanda 2: లక్కీ హీరోయిన్‌ని సైడ్ చేసి.. సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా మీనన్..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో పుల్ స్వింగ్ లో ఉన్నారు. తాజాగా సంక్రాంతి పండుగకు 'డాకు మహారాజ్'తో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ప్రస్తుతం మూవీ టీం ఇంత డాకు మహారాజ్ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ మూవీ సక్సెస్ మీట్‌ని నిర్వహిస్తుంది. త్వరలో బాలయ్య భారీ అంచనాలు మధ్య తెరకెక్కుతున్న 'అఖండ 2'తో షూటింగ్ లో పాల్గొనున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ప్రస్తుతం ఆ వార్త నెట్టింట్టో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ మూవీ అప్డేట్ ఏంటో ఓ లూక్కేయండి.
నట సింహాం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి. తాజాగా వీరి కాంబోలో తన మరో సినిమా తెరకెక్కబోతుంది. అదే.. 'అఖండ 2-తాండవం'. అఖండ సినిమాకు సిక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ కూడా బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. దీంతో 'అఖండ 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నందమూరి బాలయ్య- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'అఖండ' ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా 'అఖండ 2' ప్రకటించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు. అఖండ 2' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం కూడా విడుదల కానున్నది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో సినిమా షూటింగ్ జరిగింది. అఖండ 2 లోని కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను ప్రయాగ్‌రాజ్ షూటింగ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా ఈ సినిమాలో నటించనున్న మరో హీరోయిన్ పేరును వెల్లడించారు మూవీ మేకర్స్. నందమూరి బాలకృష్ణ సరసన అఖండ 2 మూవీలో యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "టాలెంటెడ్ నటి సంయుక్తకు 'అఖండ 2' ప్రాజెక్ట్ లోకి స్వాగతం. అఖండ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది" అని మేకర్స్ సెష్పల్ పోస్ట్ చేశారు. అయితే.. అఖండ 1 లో బాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో అఖండ 2 లో ప్రగ్యా జైస్వాల్ ను సైడ్ చేసి.. యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ తీసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. ప్రగ్యా జైస్వాల్ ఉందా? లేదా? అనేది మాత్రం మూవీ మేకర్సే ప్రకటించాలి.


Click it and Unblock the Notifications











