ఇండస్ట్రీలో మరో జంట విడాకులు... సంచలనంగా మారిన ట్వీట్
Shilpa Shetty Husband Raj Kundra Tweet : ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి జంటలు ఎక్కువ అయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... ఏదైనా సరే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కొన్ని మనస్పర్దలతోనే విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో సమంత, నాగచైతన్య విడాకులు, నిహారిక జొన్నలగడ్డ చైతన్య విడాకులు ఎంత సెన్సేషన్ సృష్టించాయో తెలిసిందే. ఇక కోలీవుడ్ లో ధనుష్, ఐశ్వర్య విడాకులు కూడా అంతే సెన్సేషన్ సృష్టించాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఓ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఓ ట్వీట్. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో విడాకులు అనగానే ముందుగా గుర్తుకువచ్చే జంట నాగచైతన్య, సమంత. వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే క్రమంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పలు జంటలు కూడా విడాకులు తీసుకున్నారు. నిహారిక, జోన్నలగడ్డ చైతన్య, మంచు మనోజ్- ప్రణతి, ధనుష్-ఐశ్వర్య ఇలా.. జంటలు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక అధికారికంగా ప్రకటించకుండా కూడా ఎంతో మంది సెలబ్రేటీలు విడిగా కూడా ఉంటున్నారు.

ఆ విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ లో మరో జంట ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్లు ఎవరో కాదు... బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా. రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దాని వల్లే వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
రాజ్ కుంద్రా ట్విట్టర్ లో రాస్తూ... మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి అంటూ రాసుకువచ్చాడు. దీనికి తోడు గుండె ముక్కలైన ఎమోజీని జోడించాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. నిజంగానే విడిపోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. శిల్పా శెట్టి ఫ్యాన్స్ అయితే ఆందోలనలో ఉన్నారు.

2021లో బ్లూ ఫిలిమ్స్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇక కొంత కాలంపాటు జైలు జీవితం కూడా గడిపాడు రాజ్ కుంద్రా. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు ఆయన. బయటకు వస్తే మాత్రం మాస్క్ తో వచ్చి కనబడే వారు. అలాంటి సమయంలో కూడా వదలని శిల్పా శెట్టి ఇప్పుడు సడెన్ గా ఎందుకు వదులుకుంటుంది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ ట్వీట్ వెనుక పబ్లిసిటీ స్టంట్ ఉందని కొంత మంది అంటున్నారు. ఇటివల రాజ్ కుంద్రా తన జీవితాన్ని బయోపిక్ తీస్తున్నాడు. అందులో అతనే హీరో. ఆ సినిమాకు యూటీ 69 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిన్న యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంటులో మాస్క్ తీసేసి మీడియా ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుందని తెలిపారు. చూడాలి మరి నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా.. లేదా ఇది సినిమా పబ్లిసిటీ స్టంటా అనేది.


Click it and Unblock the Notifications











