అంతొద్దు!..హీరోయిన్లపై అలీ సీరియస్

By Staff

Ali
ఇకపై బాంబే హీరోయిన్స్ ఆగడాలు ఇక్కడ సాగవని ప్రముఖ హాస్య నటుడు,మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అలీ అన్నారు. మా అసోసియేషన్ లో మెంబర్ షిప్ తీసుకుంటేనే వారు సినిమాల్లో నటించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఫిలిం ఛాంబర్ లో జర్గిన మీడియో మీట్ లో ఆయన మాట్లాడుతూ ...బాంబే నుండి దిగుమతి అవుతున్న చాలామంది హీరోయిన్స్ యొక్క వాస్తవ జీవితాలు అక్కడ ఎంత దారుణంగా ఉంటాయో మాకు తెలుసు.

కానీ వారు ఇక్కడ దిగగానే గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. స్టార్ హీరోల సరసన తప్ప మిగతా వారితో చేయమని చెబుతున్నారు. అక్కడ నుండే తమతో పాటూ తీసుకొచ్చే మేకప్ మెన్,హెయిర్ డ్రెస్సర్స్ కు భారీ మొత్తంలో పారితోషికాలు ఇవ్వాల్సిందిగా నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. కమిడెయన్స్ ప్రక్కన హీరోయిన్స్ గా చేయమని చెప్తున్నారు. అలా అనే ముందు ఒక్కసారి తమ రేంజ్ ఏమిటో ఆలోచించుకుంటే మంచిది. ఇక్కడ ఉన్న కమెడియన్స్ గురించి వారు ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో వారి మేనేజర్లు అతిగా వ్యవహిరిస్తున్నారని తెలిపారు. కమిడియన్స్ సరసన నటించమని అడిగితే ఏదో పర్మినెంట్ గా కాపురం చేయటానికన్నట్లు ఫీల్ అవుతున్నారని విమర్శించారు. ఈ పద్దతి మార్చకోవాలని కోరారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటూ టాప్ హీరోలందరి సరసన నటించిన సిమ్రాన్ రీసెంట్ గా కృష్ణ భగవాన్ సరసన నటించిందిని గుర్తుచేసారు.

ఇకపై హీరోయిన్స్ ఎవరైనా మా అసోసియేషన్ లో మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే. అలా తీసుకోని వారితో అసోసియేషన్ మెంబర్స్ సహకరించరని తెలిపారు.అలాగే స్థానిక తెలుగు హీరోయిన్లకు విశేష అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X