అయ్యో...రవితేజతో చాన్స్ పోయిందే, బాధపడ్డ విలన్

By Bojja Kumar

హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ సినిమాలో మెయిన్ విలన్ అవకాశం అంటే మాటలు కాదు. అలాంటి అవకాశం తనను వెతుక్కుంటూ వచ్చింది కానీ చేయలేక పోతున్నాను అంటూ తెగ బాధ పడిపోతున్నాడు బాలీవుడ్ నటుడు విక్రమ్ సింగ్. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గతంలో బాలీవుడ్ మూవీ హీరోపంతి, మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే', యారాబ్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన విక్రమ్ సింగ్....ప్రస్తుతం కన్నడ మూవీ ‘రణ విక్రమ' ఫైనల్ షెడ్యూల్ షూటింగులో భాగంగా యూరఫ్ లో ఉన్నాడు. ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ హీరో.

Bollywood hit villain Vikram Singh upset as he can’t be a part of Kick2 because of Date issues

విక్రమ్ సింగ్ కు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘కిక్-2' చిత్రంలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం వచ్చింది. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో చేయలేక పోయాడట. ఈ విషయమై విక్రమ్ సింగ్ మాట్లాడుతూ ‘ఒక వ్యక్తిగా, దర్శకుడిగా సురేందర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. అతని ‘కిక్-2' సినిమాలో డేట్స్ సమస్య వల్ల చేయలేక పోయా. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. అతని తర్వాతి సినిమాలో విలన్ పాత్ర దక్కించుకోవడానికి ట్రై చేస్తాను' అన్నారు.

రవితేజ-రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కిక్-2'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలిసి పోయింది. షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై‌ఎక్స్ ప్రెస్'చిత్రంలో విలన్ తంగబలి పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Bollywood hit villain Vikram Singh upset as he can’t be a part of Kick2 because of Date issues

‘కిక్-2' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ కూడా నటిస్తున్నాడు. . టిపికల్ కామిక్ టైమింగ్, వెరైటీ మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడం రాజ్ పాల్ యాదవ్ ప్రత్యేకత. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన రాజ్ పాల్ కిక్-2 ద్వారా టాలీవుడ్లోనూ నవ్వించడానికి వచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాలో అతని పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దాడని తెలుస్తోంది.

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.

Bollywood hit villain Vikram Singh upset as he can’t be a part of Kick2 because of Date issues

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అంటున్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X