హాట్ టాపిక్:అబిషేక్ బచ్చన్ ,అసిన్ 'ఎ' స్టోరీ
అభిషేక్ బచ్చన్, అశుతోష్ గోవార్కర్,అసిన్ వీరు ముగ్గురూ త్వరలో 'ఖేలేనే హమ్ జీ జానే సే' అనే చిత్రం కోసం జతకట్టనున్నారు. ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ ఈ ముగ్గురు పేర్లు మొదటి అక్షరాలు 'ఎ' ('A')తో ప్రారంభం కానుండటంతో అంతా ఈ చిత్రాన్ని ఎ చిత్రం అని కామెంట్ చేస్తున్నారు. అయితే మొదట అభిషేక్ కు తోడుగా మరో ఎ అంటే ఐశ్వర్యారాయ్ ని అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక చివర నిముషంలో డ్రాప్ అయింది. అందులోనూ 'లండన్ డ్రీమ్స్' తో తన బాలీవుడ్ డ్రీమ్స్ చెదిరిపోయిన అసిన్ త్వరగా ఏదో ఒక ప్రాజెక్టు కమిట్ అయ్యి బిజీ అవ్వాలనే ఆలోచనలో ఉండటం కలిసి వచ్చిందంటున్నారు. ఇక 'వాట్ ఈజ్ యువర్ రాసీ' తో ప్లాప్ ని మూట కట్టుకున్న అశుతోష్ కూడా ఈ చిత్రంతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. మరో ప్రక్క అభిషేక్ బచ్చన్ తన లేటెస్ట్ 'పా' చిత్రం ఉత్తమమైన నటన కన్పరచారని అంతటా ప్రశంసలు పొందుతున్నారు. ఆయన ఐశ్వర్యారాయ్ తో కలిసి మణిరత్న దర్శకత్వంలో 'రావణ్' చిత్రంలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











