Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొత్తగా వచ్చారు-అందాలతో మత్తెక్కిస్తున్నారు..(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : ఈ తరం బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు రావాలంటే ముఖ్యంగా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ గ్లామర్. కేవలం గ్లామర్ ఉంటే సరిపోదు......మొహమాటం, భయం అనేవి లేకుండా వాటిని కెమెరా ముందు ఆరబోయాలి. నగ్నంగా అయినా, అర్ధనగ్నంగా అయినా నటించడానికి ఓకే అనాలి. ముద్దు సీన్లు, పడకగది సీన్లు యమ రంజుగా పండించాలి. వీటితో పాటు కాస్తో కూస్తో నటన వస్తే చాలు.
తమ తొలి సినిమాలోనే అందాల ప్రదర్శనతో సంచలన సృష్టించిన చాలా మంది....ఆ తర్వాత తెరమరుగు కావడం చూస్తేనే ఉన్నాం. కారణం వారిలో గ్లామర్ తప్ప, యాక్టింగ్ స్కిల్స్ లేక పోవడమే. కొందరు మాత్రం ఇటు గ్లామర్ తోనూ, అటు అభినయంతోనూ రాణిస్తూ వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు.
గత సంవత్సరం బాలీవుడ్లో దాదాపు డజను మంది కొత్త హీరోయిన్లు వెండితెర ఆరంగ్రేటం చేసారు. అయితే వీరిలో నిలదొక్కుకుంది మాత్రం కొందరు. అయితే గ్లామర్ విషయంలో మాత్రం ఎవరికి వారే తమ సత్తా చాటారు....ప్రేక్షకులకు కనువిందు చేసారు. మరి గత సంవత్సరం బాలీవుడ్లో కొత్తగా అడుగు పెట్టి అందాలతో మత్తెక్కించిన భామలపై ఓ లుక్కేద్దాం...
హీరోయిన్ అమీజాక్సన్ ‘ఏక్ దివానాథా' చిత్రం ద్వారా బాలీవుడ్ తెరంగ్రేటం చేసింది. అందాలతో ఆకట్టుకున్న ఈ భామకు నటన పరంగా మైనస్ మార్కులే పడ్డాయి.
మహేష్ భట్ కూతురు అలియా భట్ గత సంవత్సరం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. అయితే ఈమె కూడా నటన పరంగా ఫుల్ మార్కులు సంపాదించలేకపోయింది.
జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ తెరపై అడుగు పెట్టిన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తను...గ్లామర్ డాల్ గానే తప్ప నటిగా పనికిరానని నిరూపించుకుంది.
రామ్ గోపాల్ వర్మ డిపార్ట్ మెంట్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన నథాలియా కౌర్ అందాల ఆరబోతతో మత్తెక్కించింది.
ఏజెంట్ వినోద్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలైకా హెడెన్ గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
రాజ్ 3 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇషా గుప్తా గ్లామర్ తో పాటు, నటన పరంగా కూడా ఫర్వాలేదనిపించింది.
హేట్ స్టోరీ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగ్రేటం చేసిన పవోలి దామ్ అర్ధనగ్నంగా నటించి సంచలనం సృష్టించింది.
వికీడోన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యామి గౌతమి అందంతో పాటు, నటన పరంగా ఆకట్టుకుంది.
సౌత్ లో నెం.1 హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇలియానా బాలీవుడ్ లో బర్ఫీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటుతోంది.
గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హుమా ఖురేషి గ్లామర్ పరంగా శబాష్ అనిపించుకుంది.
కాక్ టెయిల్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మోడల్ డయానా పెంటీ నటనతో పాటు, గ్లామర్ పరంగా కూడా ఫర్వాలేదనిపించుకుంది.