For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టవల్స్ లో హాట్ హీరోయిన్స్ అదుర్స్(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: హీరోయిన్స్ అందాలు తడితడిగా ఉన్నప్పుడే ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చుతాయని తెరపై రొమాన్స్ పండించే దర్శకుల నమ్మకం. సాధారణంగా వారి నమ్మకం చాలా సార్లు నిజమవుతూ ఉంటుంది. అందుకేనేమో స్టార్ హీరోయిన్స్ సైతం స్నానం చేసి టవల్ కట్టుకుని, తడి ఒళ్లుతో కొంత ఎక్సపోజింగ్ చేస్తూ శృంగార భావనలకు తెర తీస్తారు. అలాంటి కొందరి బాలీవుడ్ భామల అందాల ప్రదర్శన...

  రాజకపూర్ దగ్గరనుంచి మన తెలుగు రాఘవేంద్రరావు వరకూ సినిమా అంటే గ్లామర్ అని నమ్ముతారు. అందుకే వీరి సినిమాల్లో ఇలాంటి అందాల ప్రదర్శనలు జరుగుతూంటాయి. అయితే కొందరు హీరోయిన్స్ తాము వీటికి దూరం అంటూంటే మరికొందరు ఫోటో షూట్ చేసుకుని మరీ తాము గ్లామర్ నే నమ్ముకున్నామని తెలియచేస్తూంటారు. ప్రేక్షకుడు మాత్రం తాను ఎప్పుడూ జుగుప్స కలిగించని రసాస్వాదనకి సిద్దమే అని సినిమాలు హిట్ చేసి చెప్తూంటాడు.

  ఎటువంటి అందాల ప్రదర్శనకైనా సై అంటుంది పాకిస్థాన్‌కి చెందిన వివాదాస్పద నటి వీణా మాలిక్‌. బాలీవుడ్ ని అలరిస్తున్న ఆమె త్వరలో తెలుగు తెరను వేడిక్కించనుంది. శృంగారపరమైన పాత్రలు పోషించే ఆమె తెలుగులో నటించే చిత్రం టైటిల్ 'నగ్నసత్యం'.

  హాట్ హీరోయిన్స్ బికినీ అందాలకి కేరాఫ్ ఎడ్రస్ రియాసేన్. కెరీర్ లో పెద్దగా ఎదుగుదల లేకపోయినా ఎక్సపోజింగ్ తో తనవైపు ఆకట్టుకుంటుందీ బ్యూటీ. హారర్ నేపథ్యంలో రూపొంది హిట్టయిన తమిళ చిత్రాన్ని తెలుగులో ‘ఆరోజు' పేరుతో విడుదల చేసారు. ‘ఏం జరిగింది'అనేది కాప్షన్.

  ప్రముఖ బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. జీన్స్ వంటి చిత్రాలతో తెలుగు వారిని సైతం ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత రోబో తో అదరకొట్టింది.

  తెలుగు తెర మల్లీశ్వరి కత్రినా కైఫ్. చేసినవి రెండు సినిమాలే అయినా కత్రినా కైఫ్ ని మరిచిపోవటం తెలుగువారికి సాధ్యం కాలేదు. ఆమె రీసెంట్ గా ప్రపంచ శృంగార దేవతగా మరోమారు ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ ముద్దుగుమ్మకు మించిన మరొక సెక్సీయెస్ట్ అందగత్తే ఈ భూలోకంపై లేదని ఈ ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ నిర్వహించిన సర్వే తేల్చింది.

  రామ్ చరణ్ తాజా చిత్రం 'జంజీర్‌' రీమేక్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్న చేస్తోంది. ఇన్నాళ్ళూ బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ అందాలు త్వరలో తెలుగు వారిని సైతం పలకరించనున్నాయి.

  'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సినిమా. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ, ఇన్నీ కావు. అలాంటి అద్బుత సినిమాలో ప్రధాన ఆకర్షణ కాజల్.ఆమె టవల్ లో కనపడి డాన్స్ చేస్తూ పాడుతూంటే రెండు కళ్లూ చాలవు.

  రాణి ముఖర్జీ అంటే ‘బ్లాక్' ‘నో వన్ కిల్డ్ జెస్సీకా' వంటి నటనకు అవకాసం ఉన్న చిత్రాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే రీసెంట్ గా ఈ భామ ఏకంగా ఒకే సినిమాలో మూడు ఐటం సాంగులతో ఐటం ప్రారంభించింది. ఈ సుందరి నటించిన ‘ఏయ్యా' అనే ఓ బాలీవుడ్ చిత్రంలో నటించింది. సినిమా ప్లాప్ అయినా ఆమె అందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

  English summary
  Bollywood celebs who put the silver screen on fire with their towel act.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X