బాలీవుడ్ 'మగధీర' హృతిక్?

By Staff

Hrithik Roshan
టాలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తూ, తెలుగు సినిమా సత్తాను దేశానికి చాటిచెప్పిన చిత్రం 'మగధీర'. ప్రస్తుతం తమిళంలోకి అనువదించబడుతున్న ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించాలని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయ కథనం ప్రకారం ఇందులో హృతిక్ రోషన్ ని కథానాయకుడిగా నటింపజేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రం తెరకెక్కనుంది. ఎలాగూ ఈ బ్యానర్ పైన వచ్చిన 'గజిని' చిత్రం విజయవంతం అవడంతో పాటు అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరో నటించడంతో, తదుపరి చిత్రంలో నటించడానికి హృతిక్ కూడా సుముఖంగానే వున్నట్టు తెలిసింది. తెలుగులో 'మగధీర'ను మలచిన 'జక్కన్న' రాజమౌళే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించే అవకాశం వుంది.

ఇక దక్షిణాదిన విజయవంతం అయిన 'గజిని' చిత్రాన్ని హిందీలో తీస్తూ ఆ చిత్రనాయిక అసిన్ చేతనే హిందీలో కూడా నటింపజేసిన అల్లు అరవింద్, మిత్రవిందగా అధ్భుతంగా నటించిన కాజల్ నే హిందీ వెర్షన్ లో కూడా నటింపజేయనున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X