హీరోల భజనలో ఆరితేరిన తమన్నా

By Srikanya

హైదరాబాద్ : ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ఉన్న హీరోయిన్స్‌లో ఎక్కడైనా, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే వారు ఎవరంటే తమన్నా అంటూ టక్కున సమాధానం వస్తుంది. దానికి కారణం ఆమె అందరికీ తలలో నాలుకలా ఉంటూ, ఎవరినీ నొప్పించక, నొవ్వక తన సక్సెస్‌రేటు పెంచుకుంటోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ..అందుకోసం ఆమె అనుసరిస్తున్న భజన స్కీమ్ జనాలకు బోర్ కొట్టిస్తోందని అంటున్నారు. దీనిపై బాలీవుడ్ మీడియా సెటైర్స్ కూడా వేస్తోంది.

తమన్నా ఏ ఎండకాగొడుగు పట్టడంలో బాగా ఆరితేరిపోయిందని, అప్పుడే బాలీవుడ్ మీడియా అంటోంది. బాలీవుడ్‌లో అజయ్‌దేవ్‌గన్‌తో చేసిన 'హిమ్మత్‌వాలా' కాస్త ఫ్లాప్ అవటంతో పొగరు తగ్గిందంటున్నారు అక్కడి జనాలు. ఏ హీరోతో చేస్తే ఆ హీరోను ఆకాశానికి ఎత్తేయడం తమన్నాకు బాగా తెలిసిన విద్య అని దెప్పి పొడుస్తున్నారు. ఈ టెక్నిక్‌తో అజయ్‌ను బుట్టలో పడేసే కార్యక్రమం కూడా చేసిందని బహిరంగంగానే అంటున్నారు.

అజయ్ చాలా నెమ్మదస్తుడనీ, వర్క్ హాలిక్ అనీ, చాలా మర్యాదస్తుడని పొగడ్తలతో నింపేసింది. మొదటినుంచి అతనికి ఫాన్ అయిన తాను, చిత్రం పూర్తయేసరికి పెద్ద ఫాన్‌గా మారిపోయాననీ ఎక్కడికి వెళ్లినా రికార్డు వేసి అందర్నీ విసిగించింది. గతంలో కూడా తెలుగు హీరోలతో నటించినప్పుడు ఇలాగే చాలామందిని భజన చేసే కార్యక్రమం పెట్టుుకంది. తను పని చేస్తన్న ప్రతీ హీరోకు తాను వారికి వీరాభిమానినని చెప్పింది.

ఇటీవల ఆమె నటించిన హిందీ చిత్రం 'హిమ్మత్‌వాలా' సత్ఫలితాన్ని ఇవ్వకపోయినా తమన్నా మాత్రం దాని గురించి అస్సలు ఆలోచించడం లేదు. నేను, నా నటన నచ్చితే మరో అవకాశం వస్తుందని చెప్పింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్యతో నటించిన 'తడాఖా' చిత్రీకరణ పూర్తయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X