లేడీ నిర్మాత సంపాదన సక్రమమేనా? వందమంది దాడి!
ఏక్తా కపూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ టెలిఫిల్మ్స్ కార్యాలయంతో పాటు, ఆమె ఇంటిపై, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆమె కార్యాలయాలపై ఐటి అధికారులు ఏకకాలంలో మెరుపు దాడి చేసారు. ఈ దాడిలో దాదాపు 100 మంది అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కీలక సమాచారం అందడం వల్లనే భారీగా అధికారగణం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
బాలాజీ టెలిఫిల్మ్స్ సంస్థ కొంత కాలంగా పన్ను ఎగవేతకు పాల్పడుతుందని, అక్రమ మార్గంలో ఐటి డిపార్టుమెంటను బురిడీ కొట్టిస్తుందనే అనుమానంతో గత కొంతకాలంగా అధికారులు నిఘా పెట్టారు. ఇప్పుడు అదును చూసి దాడి చేసారు. సాయంత్రంలోగా ఫలితం ఏమిటనేది తేలనుంది.
రెండు రోజుల్లో ఏక్తాకపూర్ నిర్మించిన 'షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ సినిమా తర్వాత ఏక్తా కపూర్ త్వరలో రూపొందబోయే దాదాపు 10 సినిమాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












