RGV కజిన్ మధు మంతెన రెండో వివాహం.. అల్లు అర్జున్, అమీర్ ఖాన్‌తోపాటు ఇంకా ఎవరెవరు వచ్చారంటే?

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కజిన్, బాలీవుడ్ నిర్మాత మధు మంతెన రెండో వివాహం చేసుకొన్నారు. గత కొద్దికాలంగా ఆయన రచయిత, యోగా శిక్షకురాలు ఇరా త్రివేదితో డేటింగ్ చేస్తున్నారు. తాజాగా వారిద్దరి తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకొన్నారు. దాంతో మధు మంతెన, ఇరా త్రివేది వివాహం జూన్ 11వ తేదీన ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. మధు మంతెన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్, ఈ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధు మంతెన నిర్మాతగా కార్తీక్ అనే తెలుగు సినిమాతో ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత అమీర్ ఖాన్‌తో గజనీ, రాంగోపాల్ వర్మతో రణ్, బెంగాళీలో ఆటోగ్రాఫ్, తెలుగులో రక్త చరిత్ర, కంగన రనౌత్‌తో క్వీన్ అనే చిత్రాన్ని, బాంబే వెల్వెట్, మసాన్, ఉడ్తా పంజాబ్, ట్రాప్డ్, సూపర్ 30 లాంటి చిత్రాలను నిర్మించారు.

Bollywood Producer Madhu Mantena tied knot with Ira Trivedi on June 11th in Mumbai. Allu Arjun attends reception

మధు మంతెన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తొలుత నందన సేన్ అనే ఎన్నారై రచయిత, నటితో డేటింగ్ చేశారు. 2002 నుంచి సహజీవనం చేసి 2013లో విడిపోయారు. అనంతరం నీనా గుప్తా, క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కూతురు మసాబా గుప్తాను వివాహం చేసుకొన్నారు. వారి దాంపత్య జీవితం 2015 నుంచి 2019 వరకు కొనసాగింది. ఆ తర్వాత వారిద్దరి మ్యారేజ్ లైఫ్‌కు బ్రేకప్ చెప్పుకొన్నారు.

Bollywood Producer Madhu Mantena tied knot with Ira Trivedi on June 11th in Mumbai. Allu Arjun attends reception

మసాబా గుప్తాతో బ్రేకప్ తర్వాత మధు మంతెన, ఇరా త్రివేది డేటింగ్ చేస్తూ వచ్చారు. చివరకు జూన్ 11వ తేదీన వివాహం చేసుకొన్నారు. అనంతరం అదే రోజు రాత్రి ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి అనంతరం తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. నేను ఇప్పుడు కంప్లీట్ మ్యాన్ అయ్యాను అని కామెంట్ చేశారు.

Bollywood Producer Madhu Mantena tied knot with Ira Trivedi on June 11th in Mumbai. Allu Arjun attends reception

ముంబైలో జరిగిన రిసెప్షన్‌కు అమీర్ ఖాన్, అల్లు అర్జున్, హృతిక్ రోషన్, రాజ్ కుమార్ రావు, సారా ఆలీ ఖాన్, ఫర్దీన్ ఖాన్, అషుతోష్ గోవరికర్, అనిల్ కపూర్ ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bollywood Producer Madhu Mantena tied knot with Ira Trivedi on June 11th in Mumbai. Allu Arjun attends reception

మధు మంతెనతో అల్లు అరవింద్ ఫ్యామిలికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. గజనీ సినిమాతో అల్లు అరవింద్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో తొలి 100 కోట్ల సినిమాగా గజనీని తీర్చిదిద్దారు. మధ మంతెనతో ఉన్న అనుబంధంతోనే అల్లు అర్జున్ రిసెప్షన్‌కు హాజరైనట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X