»   »  ముండేకు సంతాపం, విషాదంలో సినీస్టార్స్

ముండేకు సంతాపం, విషాదంలో సినీస్టార్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ముండేకు గాయని లతా మంగేష్కర్, నటుడు రితీష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబరాయ్, అనుపమ్ ఖెర్ తదితరులు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.

రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే కాలేయం చితికిపోయినట్లు, షాక్‌లో గుండె ఆగిపోయినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో తేలింది. కాలేయం దెబ్బ తినడంతో లోపల రక్తం కారిందని, అకస్మాత్తుగా షాక్‌కి గురి కావడంతో గుండె ఆగిపోయిందని, ముండేకు పెద్దగా దెబ్బలు తగలలేదని, శరీరానికి తగిలిన దెబ్బలు మరణానికి కారణం కాదని నివేదికలో తేలింది.

ముండే మృతిపై సినీ తారల స్పందన స్లైడ్ షోలో....

గోపీనాథ్ ముండే

గోపీనాథ్ ముండే


మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మరణించారు.

లతా మంగేష్కర్

లతా మంగేష్కర్


దేశానికి ఎన్నో సేవలు అందించిన గోపీనాథ్ మృతి చాలా బాధకరమని, ఆయన గొప్ప నాయకులు గాక మంచి వ్యక్తి అని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ట్విట్టర్‌లో తెలిపారు. ముండే ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆమె ఆకాంక్షించారు.

జావెద్ అక్తర్

జావెద్ అక్తర్


ముండే మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని గీత రచయిత జావెద్ అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆశా భోంస్లే

ఆశా భోంస్లే


ముండే మృతి చాలా బాధాకరమని, మంచి స్నేహితుడు, సన్నిహితుడిని కోల్పోయామని ప్రముఖ గాయని, ముండే స్నేహితురాలు ఆశా భోంస్లే అన్నారు.

మహేష్ భట్

మహేష్ భట్


మంచి వ్యక్తి, నాయకుడు ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని, ఆయన మృతికి జాతి మొత్తం నివాళి అర్పిస్తుందని మహేష్ భట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రితీష్ దేశ్ ముఖ్

రితీష్ దేశ్ ముఖ్


ముండే మృతి తనకు దిగ్భ్రమపరిచిందని నటుడు రితీష్ దేష్‌ముఖ్ ట్విట్టర్‌లో తెలిపారు. తండ్రి ప్రమోద్‌మహజాన్, ముండే కలిసి ఉన్న పాత చిత్రాన్ని రితీష్ ట్విట్టర్‌లో ఉంచారు.

అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్


ముండే హఠాన్మరణం చాలా చాలా బాధాకరమని, ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందివ్వడంలో గోపీనాథ్ ముందు ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని నటి అనుపమ్ ఖెర్ తెలిపారు.

శతృఘ్న సిన్హా

శతృఘ్న సిన్హా


మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తున్నట్లు నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా తెలిపారు

మధుర్ బండార్కర్

మధుర్ బండార్కర్


ముండే మృతి దిగ్భ్రాంతి కలిగించిందని, మంచి నాయకత్వపు లక్షణాలు ఉన్న మహనీయుడిని కోల్పోయామని ఫిల్మ్‌మేకర్ మధుర్ భండార్‌కర్ ట్విట్టర్‌లో తెలిపారు.

English summary

 Here's a look at some of the tweets that Bollywood stars posted on Twitter, in their ... and we do not always know whats around the bend- RIP Gopinath Munde.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu