అల్లు అర్జున్ చిత్రం హిందీ రీమేక్ ఖరారు...డిటేల్స్

2004 లో రిలీజైన ఈ ఆర్య చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నా ప్రేమను ఫీలవ్వు చాలు అంటూ హీరోయిన్ వెనక తిరుగుతూ ఆర్య చేసే అల్లరి సినిమాని ఎక్కడికో తీసుకు వెళ్లింది. ఇన్నాళ్లకు ఆ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. కుమార్ తరౌని ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు.
ఈ మధ్యనే కుమార్ తరౌని తన కుమారుడు గిరీష్ తరౌనిని ఇటీవలే రామయ్యా వస్తావయ్యా సినిమాతో హీరోగా పరిచయం చేసాడు. ఈ సినిమా కూడా తెలుగులో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి రీమేక్. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందింది. ఇప్పుడు హిందీ రీమేక్ ఆర్య సినిమా కు దర్శకుడుగా సుకుమార్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా మ్యాటర్ ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











