రామ్ చరణ్‌తో పాటు, వీళ్లూ....ఫ్రెష్షే గురూ!(ఫోటో ఫీచర్)
ముంబై: సినిమా ప్రపంచం అంటేనే గ్లామర్‌కు మారు పేరు. ఎందులో ఉన్న లేక పోయినా....సినిమా రంగంలో మాత్రం ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళ ప్రవాహం ఉంటూనే ఉంటుంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆనందంలో ఉన్న బాలీవుడ్ పరిశ్రమ జనాలు....ఈ 2013 సంవత్సరం ఎంతో కొత్తగా ఉందని అంటున్నారు.
ఈ సంవత్సరం బాలీవుడ్లో వచ్చిన సినిమాల్లో పలు ఫ్రెష్ స్టోరీలతో పాటు, ఇన్నోవేటివ్ ఐడియాలు సరికొత్త అనుభూతిని ఇచ్చాయని అంటున్నారు. అంతే కాదు ఈ సంవత్సరం పలువురు కొత్త స్టార్స్ కూడా బాలీవుడ్‌కి ఫ్రెష్‌గా పరిచయం అయ్యారు. సౌత్‌లో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, తమిళ స్టార్ ధనుష్, పలువురు బాలీవుడ్ స్టార్ల వారసులు ఈ సంవత్సరం బాలీవుడ్‌కి కొత్తగా పరిచయం అయ్యారు.
మరి రామ్ చరణ్‌తో పాటు ఈ సంవత్సరం బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించి ఆ ఫ్రెష్ స్టార్ల గురించి స్లైడ్ షోలో తెలుసుకుందా.....

పూజా సాల్వి
మోడల్ అయిన పూజా స్వాలి ఈ సంవత్సరం రోహన్ సిప్పి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ ‘నౌటంకి సాలా' చిత్రం ద్వారా బాలీవుడ్‌కి ఫ్రెష్ గా పరిచయం అయింది. ఈ చిత్రంలో ఆమె చేసిన ‘ధక్ ధక్' సాంగ్ పాపులర్ కావడంతో ఆమెను అంతా ఇప్పుడు ధక్ ధక్ గర్ల్ అని పిలుస్తున్నారు.

పూనమ్ పాండే
బాలీవుడ్ మోడల్ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సినిమాల్లోకి రాక ముందే తన న్యూడ్ ఫోటోలు, సెక్సీ కామెంట్లను అస్త్రాలుగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా ఊహించని రీతిలో పాపులారిటీ సొంతం చేసుకున్న పూనమ్ పాండే ‘నషా' చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయం అయింది.

ధనుష్
రజనీకాంత్ అల్లుడు అనే ముద్ర ఉన్నప్పటికీ...తనకంటూ తమిళ సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్....ఈ సారి రంఝానా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

అమిత్ సాధ్
బిగ్ బాస్, నాచ్ బలియే, ఫీయర్ ఫాక్టర్ లాంటి రియాల్టీ షోలతో బుల్లితెర ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అమిత్ సాధ్....ఈ సంవత్సరం కాయ్ పోచె చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

రామ్ చరణ్ తేజ్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోల లిస్టులో చేరి పోయిన రామ్ చరణ్.....ఈ సంవత్సరం ‘జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్‌కి ఫ్రెష్ గా పరిచయం అయ్యారు. రామ్ చరణ్ సినిమా కావడం, మెగాస్టార్ తనయుడు కావడం, అమితాబ్ నటించిన గొప్ప చిత్రానికి ‘జంజీర్' రీమేక్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తీవ్ర నిరాశ పరిచింది.

క్రిస్టినా అఖీవా
మోడలింగులో తన అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టినా అఖీవా ఈ సంవత్సరం బాలీవుడ్ మూవీ ‘యామ్లా పగ్లా దీవానా-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రష్యాలో పుట్టిన ఈ ఆస్ట్రేలియన్ సంతతి భామ ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

లియాండర్ పేస్
ఇండియన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ అశోక్ కోహ్లి దర్శకత్వంలో వచ్చి ‘రాజధాని ఎక్స్ ప్రెస్' చిత్రం ద్వారా ఈ సంవత్సరం బాలీవుడ్‌కి ఫ్రెష్‌గా పరిచయం అయ్యారు.

సిద్ధాంత్ కపూర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ తనయుడు సిద్ధాంత్ కపూర్ ఈ సంవత్సరం బాలీవుడ్ కి పరిచయం అయ్యారు. సంజయ్ గుప్తా దర్శకత్వంతో వచ్చిన ‘షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రంలో నటించారు.

ఎల్లి అవ్రామ్
ప్రస్తుతం బిగ్ బాస్-7 రియాల్టీ షోలో పాలు పంచుకుంటున్న ఎల్లి అవ్రామ్ త్వరలో‘మికీ వైరస్' అనే బాలీవుడ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రంలో మనీష్ పాల్ కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











