మనీషా కొయిరాలా హెల్త్ లేటెస్ట్ ఇన్ఫో
ముంబయి: క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి చెంది కోలుకున్న మాజీ హీరోయిన్ మనీషా కొయిరాలా మెల్లగా దైనందిన కార్యక్రమాల్లో పడుతోంది. తను కాన్సర్ ని జయించానని సంతోషంగా చెప్తోంది. అండాశయ క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి తన అనుభవాలను ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకుంటోంది.
అక్కడి వీధుల్లో తెగతిరిగేసి షాపింగ్ చేశానంది. చల్లని నిమ్మరసం తాగుతూ...మొక్కజొన్నలు తింటూ...షాపుల వెంట తిరుగుతూ బేరాలు చేయడం ఓ ఆహ్లాదకరమైన అనుభవం అని చెప్పింది. రోడ్లపై నడుస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది అంటూ ఆమె తన ట్విట్టర్‌లో రాసుకుంది.
అస్వస్థతకు గురైన ఆమె ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరగా టెస్టుల్లో సర్వైకల్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.


Click it and Unblock the Notifications












