సినీ తారల రహస్య వివాహాలు (ఫోటో ఫీచర్)
ముంబై: మనిషి జీవితంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటి అందరికీ తెలిసిందే. అందుకే ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకుంటారు అంతా. ఎవరి రేంజికి తగిన విధంగా వారు తమకు ఉన్నంతలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం పరిపాటి. అయితే ఈ మధ్య కొందరు సినీతారలు మాత్రం విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు.
చాలా మంది స్టార్స్ తమ వివాహాలను గుట్టు చప్పుడు కాకుండా, మీడియాకు...సాధారణ జనాలకు తమ వివాహం విషయం తెలియకుండా జరుపుకుంటున్నారు. తీరా తంతు ముగిసిన తర్వాత పెళ్లి జరిగిన విషయాన్ని బయట పెడుతున్నారు. ఎందుకు ఇలా అంటే...? ముందు విషయం బయటకు తెలిస్తే అభిమానులు, మీడియా మూలంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయాల్సి వస్తుందని అంటున్నారు స్టార్స్.
అలా రహస్యంగా వివాహం చేసుకున్న సినీ తారల గురించి స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం...

జాన్ అబ్రహం
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం ఎవరికీ తెలియకుండా రహస్యంగా తన గర్ల్ ఫ్రెండ్ ప్రియాం రాంచల్‌ను పెళ్లాడారు. పెళ్లయిన చాలా చాలం తర్వాత న్యూఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు.

అమీర్ ఖాన్
తొలుత తన చిన్ననాటి స్నేహితురాలు రీనాను పెళ్లాడిన అమీర్ ఖాన్, తర్వాత ఆమెతో విడిపోయారు. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును రహస్యంగా వివాహం చేసుకున్నారు.

అక్షయ్ కుమార్
పెళ్లికి ముందు అక్షయ్ కుమార్‌కు చాలా మంది హీరోయిన్లతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆయన ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడారు. వీరి వివాహం గుట్టు చప్పుడు కాకుండా 2001లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగింది.

అజయ్ దేవగన్
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, కాజోల్ దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత 1999లో రహస్యంగా సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

మాధురి దీక్షిత్
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్... డాక్టర్ శ్రీరామ్‌ను పెద్దగా ఆర్భాటాలు లేకుండా మీడియా, అభిమానులకు తెలియకుండా పెళ్లాడారు.

కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వివాహం కూడా మీడియాకు, అభిమానులకు తెలియకుండా కేవలం కొందరు సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

సమీరా రెడ్డి
బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి వివాహం అక్షయ్ వర్దేతో గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది. మీడియాకు, అభిమానులకు తెలియకుండా రహస్యంగా ఈ వివాహం జరిగింది.

సయాలీ భగత్
ఢిల్లీకి చెందిన వ్యాపారి నవనీత్ ప్రతాప్ సింగ్‌ను పెళ్లాడిన నటి సయాలీ భగత్ ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.

సెలీనా జైట్లీ
బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్ల తన బాయ్ ఫ్రెండ్ పీటర్ హాగ్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కవల పిల్లలకు తల్లి.

ఆయేషా టకియా
సూపర్ చిత్రంలో నటించి ఆయేషా టకియా....హోటల్ వ్యాపారి ఫర్హాన్ అజ్మీని 2009లో పెళ్లాడింది.

లారా దత్తా..
బాలీవుడ్ హీరోయిన్ లారా దత్తా, టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి వివాహం గోవాలో 2011లో జరిగింది.

రాణి ముఖర్జీ
బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ, ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా వివాహం నిన్న (ఏప్రిల్ 21)రాత్రి జరిగింది. పెళ్లి జరిగిన విషయాన్ని ఈ రోజు బయట పెట్టారు.


Click it and Unblock the Notifications











