»   » ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ నో ..సల్మాన్ సై

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ నో ..సల్మాన్ సై

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా కాలాంగా ఊరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చూసి రీమేక్ కు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయమై కాపీ రైట్ కేసు ఉండటంతో ఆగిపోయిందని వినికిడి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

సౌత్ సినిమా రీమేక్‌ల్లో నటించడానికి ఆసక్తి కనబరుచే సల్మాన్‌ ఈ చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ నటించబోతున్నాడు అనే మాట కొంత కాలంగా వినిపిస్తుంది. తాజాగా మురుగదాస్‌ 'కత్తి' హిందీ రీమేక్‌లో నటించడానికి సల్లూభాయ్‌ పచ్చ జెండా వూపేశాడని సమాచారం.

''మురుగదాస్‌ చెప్పిన కథ సల్మాన్‌కు బాగా నచ్చినా ఆయన కోర్టు కేసుల్లో ఉండటంతో అప్పట్లో ఓకే చెప్పలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని అతుల్‌ అగ్రి హోత్రి నిర్మిస్తారు'' అని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

Bollywood's Super Star In Kathi Remake

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కాపీ సమస్య...

ఈ భారీ చిత్రం తమ కథనే కాపీ కొట్టి తీసారంటూ తిరువల్లూరు కి చెందిన మింజూర్ అనే వ్యక్తి కేసు వేసారు. తను రూపొందిస్తున్న మూత కుడై అనే చిత్రం కథనే తస్కరించాడంటూ కత్తి చిత్రం రిలీజ్ ని ఆపాలంటూ కోర్టులో పిటీషన్ వేసాడు. అయితే ఈ విషయమై మురుగదాస్ వెంటనే స్పందించారు. తనకు అసలు మింజూర్ అనే వ్యక్తి ఎవరో తెలియదని, కేవలం ఇవన్నీ జనం అటెన్షన్ ని గ్రాబ్ చేయటానికి చేస్తున్న ట్రిక్ అనే కొట్టిపారేసారు.

మరో కేసు..

చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన కత్తి చిత్రం గత ఏడాది విడుదలైంది. ఈ చిత్రం కథ తాను దర్శకత్వం వహించిన భూమి అనే డాక్యుమెంటరీ కథాంశం అని, తన కథను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చోరీ చేసినట్లు, ఇందుకు నష్ట పరిహారం చెల్లించాలని, వేరే భాషల్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసేందుకు స్టే విధిం చాలని తిరుకాట్టుపల్లి సమీపంలోగల ఇలంగాడు గ్రామం దిగువ వీధికి చెందిన అన్బువ రాజశేఖర్ (32) తంజావూరు జిల్లా సెషన్సు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటు డు విజయ్, నిర్మాతలు కరుణాకరన్, సుభాష్‌కరన్, చాయాగ్రాహకుడు జార్జి విలియమ్ అనే ఐదుగురిపై నేరం ఆరోపించారు.

English summary
Salman liked "Kathi" film immensely and he want Murugadoss himself to direct the film. Confirming that, a source from Murugadoss camp shared this news.
Please Wait while comments are loading...