‘కబీర్ సింగ్’ ఎఫెక్ట్.. ‘అర్జున్ రెడ్డి’ని వెతుకుతున్న బాలీవుడ్
'అర్జున్ రెడ్డి'.. ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు మన వాళ్లు పెట్టుకున్న బౌండరీలను దాటేసింది. దీంతో ఈ సినిమా తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. అందుకే మన దేశంలోని చాలా భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హిందీలో 'కబీర్ సింగ్' పేరిట వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
షాహీద్ కపూర్ - కియారా అద్వాణీ జంటగా నటించిన 'కబీర్ సింగ్'ను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు హిందీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటికే 'కబీర్ సింగ్' భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో స్థానం కూడా సంపాదించుకుంది.

ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు. అంతేకాదు, డాక్టర్లు కూడా దీన్ని వ్యతిరేకించారు. కానీ రివ్యూలతో సంబంధం లేకుండా కబీర్ సింగ్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
దీనికితోడు, ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వివాదంలో చిక్కుకోవడంతో బీ టౌన్‌లో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. బాలీవుడ్‌లో సినిమా విడుదలైన దర్శకుడు సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు. వీళ్లంతా ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగుంటూ ఘాటుగా స్పందించాడు. దీంతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి.
సినిమా సూపర్ హిట్‌గా నిలవడానికి తోడు, దర్శకుడి వివాదాలతో మాతృక అయిన 'అర్జున్ రెడ్డి'పై హిందీ ప్రేక్షకులు దృష్టి సారించారు. దీంతో యూట్యూబ్‌లో తెలుగు ట్రైలర్‌కు భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అలాగే అమేజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ సినిమాకు కూడా అదే స్థాయిలో క్లిక్స్ వస్తున్నాయి. మొత్తానికి 'కబీర్ సింగ్' ఎఫెక్ట్‌తో 'అర్జున్ రెడ్డి' హాట్ టాపిక్ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











