ముగ్గురు గాయకులపై చీటింగ్ కేసు.. మూడేళ్లు శిక్షపడే అవకాశముందంట..
బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న అంకిత్ తివారీ, శిల్పా రావు, ఆకృతి కక్కర్‌పై ఆదివారం ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు సింగర్లు చీటింగ్ కేసులో ఇరుక్కోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న అంకిత్ తివారీ, శిల్పా రావు, ఆకృతి కక్కర్‌పై ఆదివారం ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాకు చెందిన ఓ ఈవెంట్ కంపెనీని మోసగించారన్న ఆరోపణలపై ఈ ముగ్గురు గాయకులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

30 లక్షలు తీసుకొని
రెండు సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో బ్రదర్‌హుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓ కార్యక్రమం కోసం ఒప్పదం కుదుర్చుకొన్నది. గాయకుడు అంకిత్ తివారీ సొంత కంపెనీ అయిన ఈ సంస్థ సదరు ఈవెంట్ కంపెనీ నుంచి అడ్వాన్సుగా రూ.30 లక్షలు పుచ్చుకొన్నది. అయితే ఏదో కారణం చేత ఆ ఈవెంట్ జరుగలేదు.

నోటీసులకు స్పందించకపోవడంతో..
ఆ తర్వాత అంకిత్‌తో పలుమార్లు అమెరికా సంస్థ సంప్రదింపులు జరిపింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అమెరికా కంపెనీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అయితే నోటీసులకు అంకిత్ స్పందించకపోవడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

అమెరికా కంపెనీ ఫిర్యాదు మేరకు
అమెరికా కంపెనీ ఫిర్యాదు మేరకు అంకిత్ తివారీ, శిల్పారావు, ఆకృతి కక్కర్‌పై ఐపీసీ సెక్షన్ 406 కింద కేసు నమోదు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసులో దోషులుగా తెలితే మూడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా ఆ రెండు కూడా విధించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

అంకిత్ తివారీ బ్రదర్‌హుడ్ ఎంటర్‌టైన్‌మెంట్
గాయకుడు అంకిత్ తివారీ 2013 అక్టోబర్ 31న బ్రదర్‌హుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థను స్థాపించాడు. సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. త్వరలోనే సినీ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నది. గత కొన్ని సంవత్సరాలుగా విదేశాల్లో ఈవెంట్లను నిర్వహిస్తున్నది.


Click it and Unblock the Notifications











