twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినా బికినీపై ఎవరెవరు ఏమంటున్నారు? (పిక్చర్స్)

    By Pratap
    |

    ముంబై: అందాల తార కత్రినా కైఫ్ బికినీపై బాలీవుడ్‌లో దుమారం ముగిసినట్లు లేదు. తాను రణబీర్ కపూర్‌తో ఖాళీ వేళల్లో గడిపిన ఫోటోగ్రాప్‌లను మీడియా ప్రచురించడంపై కత్రినా కైఫ్ గుర్రుమంటోంది. తన వ్యక్తిగత జీవితంలో ప్రవేశించారంటూ దుమ్మెత్తి పోస్తోంది. తీవ్ర అసంతృప్తికి గురైన కత్రినా మీడియాకు ఓ బహిరంగ లేఖ రాయడానికి కూడా సిద్ధపడింది.

    తన అనుమతి లేకుండా మీడియా ఫొటోలు తీసుకుందని కత్రినా కైఫ్ ఆ బహిరంగ లేఖ విమర్శించింది. అది కూడా తాను ప్రైవేట్ వెకేషన్‌లో ఉన్నప్పటి ఫోటోలను ప్రచురించడం ఆక్షేపణీయమని ఆమె తప్పు పట్టింది. తాను హాలిడేలో ఉన్నప్పుడు తన అనుమతి లేకుండా ఫొటోలు తీసుకున్నారని, వాటిని వ్యాపార ప్రయోజనాలకు వాడారని ఆమె అన్నది.

    ఆ ఫొటోలను ప్రచురించడం ఆపేయాలని ఆమె మీడియాను కోరింది. మీడియాతో తనకు మంచి సంబంధాలున్నాయని, మీడియాకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉన్నానని చెప్పుకుంది. అయితే, దాడిచేసే పద్ధతిలో వ్యవహరించిన తీరు మంచిది కాదని ఆమె విమర్శించింది.

    షారూక్ ఖాన్

    షారూక్ ఖాన్

    "నేను ఈ జీవితాన్ని ఎన్నుకున్నాను. నేను నా భవనంపైన నిలబడి చేతులు ఊపుతాను. అక్కడ ఆనంద వదనాలతో చాలా మంది ఉన్నారు. అవి నాకు చాలా ఆనందిస్తాయి. నేను ఈ జీవితాన్ని కోరుకుంటున్నాను. నేను పబ్లిక్ ఫిగర్‌ను అనే విషయం నాకు తెలుసు" అని షారూక్ ఓసారి అన్నాడు. "ప్రజలు నా ఇంట్లోకి దూసుకుని రావాలనుకుంటారు. అయితే నేను అంతే దూకుడుగా నా పిల్లలను, నా కుటుంబాన్ని, నా మిత్రులను రక్షించుకుంటాను. వీటిన్నంటిని దాదాపు 99.9 శాతం సందర్భాల్లో అంగీకరిస్తాను. మంచి జరగాలనే అనుకుంటాను, మిగతా 0.1 శాతం డిస్టర్బ్ కావద్దని అనుకుంటాను" అని అన్నారు.

    రైమా సేన్

    రైమా సేన్

    "సెలిబ్రిటీలు తమ ప్రైవేట్ జీవితాలను రహస్యంగా ఉంచుకోవాలని అనుకుంటారు. ఉదాహరణకు నేను ఎవరితోనైనా నైట్ క్లబ్‌కు వెళ్లే మీడియా కవర్ చేయవద్దని అనుకోను, ఎందుకంటే అది పబ్లిక్ ప్లేస్. కొన్నిసార్లు ప్రజలు ఫోటోలు తీసి అప్‌లోడ్ చేస్తుంటారు. అన్ని సార్లు మీడియాను నిందించలేం" అని రైమా అభిప్రాయపడింది.

    మనోజ్ వాజ్‌పేయి

    మనోజ్ వాజ్‌పేయి

    "మీరు అనుకున్నట్లుగా మీడియా ప్రతినిధులు ప్రవర్తించాలని అనుకుంటారు. ఒక్కసారి వారిని మీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తే వద్దనుకున్నప్పుడు వాళ్లు దూరిపోతారు" అని మనోజ్ వాజ్‌పేయ్ అన్నాడు.

    తుషార్ కపూర్

    తుషార్ కపూర్

    "చాలా ఏళ్ల కింద హాలీవుడ్‌లో చోటు చేసుకున్న మీడియా బూమ్ ఇప్పుడు ఇక్కడ చోటు చేసుకుంది, అది అందులో భాగమే. మన పరిశ్రమ పెరుగుతోంది, పెద్దతవుతోంది, అది జరుగతుంది. అందువల్ల ఓ యాక్టర్ మరింత జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి" అని తుషార్ కపూర్ అన్నాడు.

    జాక్విలిన్ ఫెర్నాండెజ్

    జాక్విలిన్ ఫెర్నాండెజ్

    "ఓ వ్యక్తి దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని ఆనందించాలని అనుకోవడం అన్యాయం. సెలిబ్రిటీలు మానవులు కూడా. ఏ కారణం లేకుండా వారిని లక్ష్యం చేసుకోవడం ఏమిటి" అని జాక్విలిన్ ఫెర్నాండెజ్ అభిప్రాయపడింది.

    ఇమ్రాన్ ఖాన్

    ఇమ్రాన్ ఖాన్

    "పాపరాజీ కల్చర్ మీలోకి చొచ్చుకుని వస్తోంది, అది ఎప్పుడూ విచిత్రంగానే కనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఏదీ దాచుకోవాలని ప్రయత్నించలేదు" అని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు.

    దీపికా పడుకొనే

    దీపికా పడుకొనే

    "అటువంటి నాకు ఎప్పుడూ జరగలేదు. నువ్వు సెలిబ్రపిటీవి లేదా పబ్లిక్ ఫిగర్‌వి అయినప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. దేని కోసం కూడా నువ్వు ఎవరినీ నిందించలేవు. నేను పబ్లిక్ ఫిగర్‌ను అయితే, ఎవరైనా తనను పట్టుకోవాలని అనుకుంటే నేను కాస్తా జాగ్రత్తగా ఉంటాను" అని దీపికా పడుకోనే అన్నది.

    English summary
    The fuss around Bollywood actress Katrina Kaif's recent bikini act doesn't seem to die out soon. The gorgeous actress felt betrayed after the media encroached on her personal space by printing photographs of Ranbir Kapoor and her, on vacation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X