ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ కవర్ పేజిపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్
Can one actor change a nation? అనే పేరుతో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ అమీర్ ఖాన్ ఇంటర్యూని ప్రచురించనుంది. సాధారణంగా కెమెరా ముందు అనునిత్యం కనిపించే అమీర్ ఖాన్ తన మనసులోని భావాలను కొన్నింటిని ఇక్కడ పంచుకున్నారు. భారతదేశంలో ఉన్నసామాజిక సమస్యలను సత్యమేవ జయతే టివి షో ద్వారా మన ముందుకు తెచ్చాడు. సత్యమేవ జయతే టీవి షో 100కు పైగా దేశాల్లో తెలుగు, తమిళం, ఇంగ్లీషు, హిందీ, మళయాళం లాంటి ఎనిమిదికి పైగా భాషల్లో ప్రసారం అయింది.
ఆమిర్ ఖాన్ తన కార్యక్రమంలో భ్రూణ హత్యలు, బాలలపై లైంగిక వేధింపులు, గృహ హింస వంటి అంశాలు కూడా సంచలనం రేకెత్తించాయి. ఈ కార్యక్రమం మొత్తం 13 వారాల పాటు ప్రసారం అయింది. అమీర్ ఖాన్ ప్రసారం చేసిన కొన్ని విషయాలు పార్లమెంట్‌ను సైతం ఆకర్షించడం వల్ల ఆమిర్‌తో మరిన్ని ప్రజా ఉపయోగకరమైన అంశాలపై చర్చించాలని భావించారు.
'సత్యమేవ జయతే' కార్యక్రమం అన్నివర్గాలవారిని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు, ఇందులో ఆమిర్ ఎంచుకుంటున్న అంశాలపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిచింది. ఈ కార్యక్రమంలో మరికొన్ని అంశాలను చేరిస్తే బాగుంటుందని పార్లమెంట్ భావించింది... ఈ విషయమై ఆమిర్‌తో చర్చించాలని ఉన్నత చట్టసభ అభిప్రాయపడి ఆయనకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ కమిటీ అధినేత శాంతాకుమార్ ఈ ఆహ్వానం పంపినట్లు సమాచారం. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్‌ని మ్యాగజైన్ కవర్ పేజి ఫీచర్‌గా ప్రచురించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications












