కౌన్ బనేగాకరోడ్ పతీలో కోటి గెలుచుకున్నస్టార్ హీరో?
దేశ వ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా ఎన్ని కోట్లైనా తీసుకోవచ్చు గానీ, ఓ ఆటలో కోటి రూపాయలు గెలుపొందడం మాత్రం విశేషమే కదా? ఆ విశేషం తాజాగా 'కౌన్ బనేగా కరోడ్ పతీ' క్విజ్ లో చోటుచేసుకుంది. ఈ గేం షో బెంగాలీ వెర్షన్ కి క్రికెటర్ సౌరవ్ గంగూలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్విజ్ కార్యక్రమానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ లో తాజాగా ఆమిర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ తో కలిసి పాల్గొన్నాడట.
ఇందులో లైఫ్ లైన్ ద్వారా ఫైనల్ కి చేరుకున్న ఆమిర్ ఎన్నో తర్జనభర్జనలు పడిన తర్వాత, భార్య కిరణ్ రావ్ తో డిస్కస్ చేసిన పిదప చివరి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాడట. దాంతో ఆమిర్ ను విజేతగా ప్రకటిస్తూ కరోడ్ పతీగా సత్కరించాడట సౌరవ్. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం అవుతుందని అంటున్నారు. ఆమిర్ గెలిచిన విషయాన్ని నిర్వాహకులు సస్పెన్స్ లో ఉంచారు. ఆమిర్ కూడా దీని మీద స్పందించడానికి నిరాకరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











