ఇదంతా మా కర్మ.. నెపొటిజంపై తిరగబడుతున్న బాలీవుడ్.. పరిస్థితి చేయి దాటితే కష్టమే!

ప్రస్తుతం ఇండియాలో కరోనా కంటే ఎక్కువగా వినిపిస్తున్న పదం నెపొటిజం. వారసత్వం నుంచి వచ్చిన నటీనటులకు మాత్రమే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయని ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చే వారిని తొక్కేస్తున్నారనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. అయితే నెపొటిజం విమర్శలపై కూడా బాలీవుడ్ లో కొంతమంది తిరగబడుతున్నారు. ఇదంతా మా ఖర్మ అంటూ.. ఎదో ఒక రోజు మీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని హిందీ నటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Bollywood Star Actors Angry On Nepotism Comments || Oneindia Telugu
అవును.. అది నిజమే..

అవును.. అది నిజమే..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కి కారణం కొంతమంది బాలీవుడ్ ప్రముఖులే కారణమని ఇండస్ట్రీలోని వారే కామెంట్స్ చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. అవును బాలీవుడ్ లో నెపొటిజం ఉందంటూ.. కష్టపడి పైకొచ్చే వారిని కావాలనే తొక్కేస్తున్నారని, అవకాశాలు రానివ్వకుండా అడ్డుకుంటున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు.

అది మా కర్మ..

అది మా కర్మ..

ఇటీవల అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ నెగిటివ్ కామెంట్స్ కి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఎవరు అక్కడ పుట్టాలన్నది.. ఎక్కడ ఉండాలన్నది కర్మతో మూడు పడి ఉంటుందని మేము కావాలని ఇక్కడకు రాలేదు కదా అని సోషల్ మిడియాలోనే వివరణ ఇచ్చింది. అంతే కాకుండా అనిల్ కూతురిగా పుట్టడం గర్వంగా ఉందంటూ.. సోషల్ మీడియాలో ఎవరు కామెంట్ చేయకుండా కామెంట్ సెక్షన్ బాక్స్ ని ఆఫ్ చేసింది.

అలియా భట్ తల్లి ఆగ్రహం..

అలియా భట్ తల్లి ఆగ్రహం..

ఇక అలియా భట్ తల్లి కూడా నెపొటిజం వస్తున్న విమర్శలపై స్పందించింది. ఒక స్టార్ కొడుకు కూతురు అంటే అభిమానుల్లో అంచనాలు బాగానే ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడానికి చాలా కష్టపడాలి. నేడు నెపొటిజం పేరుతో విమర్శలు చేస్తున్నవారు ఎదో ఒకరోజు మీ బిడ్డల ద్వారా ఇలాంటి విషయంపైనే స్పందించాల్సి ఉంటుందని అలియా భట్ తల్లి సోని రాజ్డాన్ వివరణ ఇచ్చారు.

విమర్శలు ఇలానే కొనసాగితే..

విమర్శలు ఇలానే కొనసాగితే..

ఇలానే విమర్శలు కొనసాగితే త్వరలో మరికొంత మంది బాలీవుడ్ తారలు కూడా స్పందించే ఛాన్స్ ఉన్నట్లు బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. సల్మాన్ ఖాన్ పై విమర్శకు రావడంతో ముందుగా అభిమానులను కంట్రోల్ చేసి ఇలాంటి ఎమోషనల్ సమయంలో సైలెంట్ గా ఉంటేనే మంచిది అనేలా ట్వీట్ చేశాడు. మొత్తానికి బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం ఒక ఊహించని అలజడికి రేపిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X