హాస్పిటల్‌లో చేరిన దిలీప్ కుమార్, నసీరుద్దీన్ షా.. బాలీవుడ్‌లో ఆందోళన.. ఆరోగ్యం ఎలా ఉందంటే!

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడంతో బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. లెజెండ్ దిలీప్ కుమార్ మరోసారి శ్వాస సంబంధింత సమస్యలతో హాస్పిటల్‌లో చేరారు. ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ కుటుంబ సభ్యులు ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో చేర్పించారు.

శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయనను హస్పిటల్‌లో చేర్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు అని వెల్లడించారు.

దిలీప్ కుమార్‌ను మంగళవారం ఉదయం హాస్పిటల్‌లో చేర్పించారు. గతంలో మాదిరిగానే ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వయోభారంతో బాధపడుతున్నందున్న ఆయనను చికిత్స కోసం తీసుకొచ్చారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు తెలిపారు.

Bollywood star actors Dilip Kumar and Naseeruddin Shah hospitalised

ఇదిలా ఉండగా, విలక్షణ నటుడు నసీరుద్దీన్ కూడా హాస్పిటల్‌లో చేరడం బాలీవుడ్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను జూన్ 29వ తేదీన హాస్పిటల్‌లో చేర్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా సోకింది. దానికి చికిత్సను వైద్యులు అందిస్తున్నారు. అంతా బాగుంటే గురువారం ఆయనను డిశ్చార్జి చేసే అవకావం ఉంది అని మేనేజర్ తెలిపారు.

ప్రస్తుతం నసీరుద్దీన్ షా భార్య, కుమారుడు వివాన్ షా ఆయన వెంట ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గత ఏడాది కూడా హస్పిటల్‌లో చేరినప్పుడు వచ్చిన రూమర్లను కుమారుడు వివాన్ షా ఖండించారు. తన తండ్రి ఆరోగ్యం బాగుందని క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X