ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిందట.. బాహుబలికే షాకిచ్చింది.. ఆ హీరోయిన్‌కు ఎంత ధైర్యం..

బాహుబలి2 తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఆ రేంజ్‌లో పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో సాహోలో నా పాత్ర లెంగ్త్ బాగాలేదని ప్రభాస్ పక్కన నటించడానికి ఓ హీరోయిన్ ఒప్పుకోలేదట.

By Rajababu

Recommended Video

ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిందట..!

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ పక్కన నటించడానికి అవకాశం వస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది కుర్ర హీరోయిన్లు ఆశపడ్డారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే బాహుబలి2 తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఆ రేంజ్‌లో పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో సాహోలో నా పాత్ర లెంగ్త్ బాగాలేదని ప్రభాస్ పక్కన నటించడానికి ఓ హీరోయిన్ ఒప్పుకోలేదట. ఈ ఆసక్తికరమైన అంశం తాజాగా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..

 సాహో హీరోయిన్ కోసం వేట

సాహో హీరోయిన్ కోసం వేట

సాహో చిత్రంలో హీరోయిన్ కోసం అనుష్కను ఓకే చేశారు. కొన్ని కారణాల వల్ల అనుష్కను చిత్ర నిర్మాతలు తప్పించారు. దాంతో పలువురు హీరోయిన్లతో సంప్రదింపులు జరిపారు. వారిలో దిశాపటానీ, అలియా భట్, శ్రద్ధాకపూర్, కత్రినా కైఫ్ తదితరులు ఉన్నారు.

ఆలియాతో సంప్రదింపులు

ఆలియాతో సంప్రదింపులు

సాహోలో హీరోయిన్‌ కోసం బాలీవుడ్ అందాల తార ఆలియా భట్‌ను తొలుత సంప్రదించారుట. ఆలియాకు అవకాశం రావడంతో ఆమె గురువు కరణ్ జోహర్ కూడా చాలా సంతోషపడినారట. ప్రభాస్ పక్కన నటించేలా ఆలియాను ఒప్పించడానికి తెగ ప్రయత్నించారట. అయితే గురువు కరణ్ కూడా కాదని సాహో చిత్రాన్ని రిజెక్ట్ చేశారట.

 ప్రభాస్‌కు నో చెప్పిన ఆలియా

ప్రభాస్‌కు నో చెప్పిన ఆలియా

ప్రభాస్ పక్కన నటించవద్దని ఆలియా భట్ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రభాస్‌తో సమానంగా సీన్లు లేకపోవడమేనట. సాహోలో హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ప్రభాస్ పక్కన చేసేందుకు ఇష్టపడలేదని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

 హీరోయిన్ ఓరియెంటెండ్ పాత్రల్లో

హీరోయిన్ ఓరియెంటెండ్ పాత్రల్లో

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఆలియాభట్ హీరోయిన్ ఓరియెంటెండ్, హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉండే పాత్రలనే పోషిస్తున్నారు. షారుక్, షాహీద్ లాంటి హీరోలకు సమానంగా ఉండే పాత్రలను పోషిస్తున్నది. అలాంటి నేపథ్యంలో సాహోలో నాలుగు సీన్లకు పరిమితమైన పాత్రను పోషించడానికి ఇష్టపడలేదట.

 దక్షిణాదిలో అదిరిపోయే ఎంట్రీ కోసం

దక్షిణాదిలో అదిరిపోయే ఎంట్రీ కోసం

బాలీవుడ్‌లో మంచి పాత్రలతో పేరు తెచ్చుకొంటున్న నేపథ్యంలో దక్షిణాది ఎంట్రీ అదిరిపోవాలనే ఉద్దేశంతో ఆలియా ఈ నిర్ణయం తీసుకొన్నదట. ఉడ్డా పంజాబ్, డియర్ జిందగీ, యే దిల్ హై ముష్కిల్ చిత్రాలు అలియాకు మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. సాహో చిత్రాన్ని రిజెక్ట్ చేయడాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా సరే అన్నారనేది తాజా సమాచారం.

 ప్రభాస్ అంటే నాకు ఇష్టం

ప్రభాస్ అంటే నాకు ఇష్టం

సాహోను వదులుకొన్నప్పటికీ.. ఇప్పటికీ సౌత్‌లో తనకు నచ్చిన హీరో ప్రభాస్ అని ఆలియా భట్ ఇటీవల చెప్పింది. ప్రభాస్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవడం బాధగానే ఉంది. కానీ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. మళ్లీ ప్రభాస్‌తో అవకాశం వస్తే వదులుకోను అని ఆలియా ట్విట్టర్ చాట్‌లో పేర్కొనడం గమనార్హం.

 ప్రభాస్ అంటే శ్రద్ధాకపూర్‌‌కు..

ప్రభాస్ అంటే శ్రద్ధాకపూర్‌‌కు..

సాహో చిత్రాన్ని ఆ విధంగా వదులుకోవడంతో ఆ అవకాశం శ్రద్ధాకపూర్‌కు వచ్చింది. బాహుబలికి ముందు ప్రభాస్‌ పక్కన నటించడానికి ఒప్పుకోకపోయినా ఆ తర్వాత బాహుబలి క్రేజ్ చూసి ఒప్పేసుకున్నదట.

 శరవేగంగా సాహో షూటింగ్

శరవేగంగా సాహో షూటింగ్

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. శ్రద్ధాకపూర్‌తో కలిసి చేసిన తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. రెండో షెడ్యూల్ కూడా జోరుగా సాగుతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X