»   » విచ్చలవిడితనం అని మనం అనుకుంటే ఎలా? (ఫోటోస్)

విచ్చలవిడితనం అని మనం అనుకుంటే ఎలా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పత్రికలు, టీవీ మీడియా, సోషల్ మీడియా ప్రభంజనం ఇంతగా లేని రోజుల్లో సినిమా స్టార్ల లైఫ్ స్టైల్, వారి కుటుంబ విషయాలు సాధారణ ప్రేక్షకులకు అంతగా తెలిసేవి కావు. కేవలం వారి సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రేక్షకులకు తెలిసేవి. పత్రికలు, టీవీ ఛానళ్ల ప్రాభల్యం పెరిగిన తర్వాత పరిస్థితి కాస్త మారింది.

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత.... సోషల్ మీడియా తీరే మారిపోయింది. స్టార్స్‌కు సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో అభిమానులకు తెలిసిపోతోంది. ఫాలోయింగ్ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో పలవురు సినీ స్టార్స్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

కొన్ని విషయాల్లో పిల్లలు పెద్దలను ఫాలో అయినట్లే... సోషల్ మీడియా విషయంలో కూడా అదే జరుగుతోంది. చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెలబ్రిటీల పిల్లలు కూడా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో యాక్టివ్ అవ్వడం మొదలు పెట్టారు.

మొదట్లో ఇది బాగానే ఉన్నా... కొన్ని సందర్భాల్లో తమ పిల్లల పోకడలు చూసి కొందరు స్టార్స్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు షేర్ చేయాలి అనే ఇంగిత జ్ఞానం లేక పోవడమే ఇందుకు కారణం.

అయితే ఇది విచ్చలవిడి తనం అనాలా? లేక తెలిసీ తెలియనితనం అనాలా? అంటే....రెండు రకాలుగా అని చెప్పక తప్పదు. తమ తల్లిదండ్రుల నటించే సినిమాల్లో ఉన్నట్లు వారు రియల్ లైఫ్‌లో ఉంటున్నారు. కొన్ని సార్లు బికినీ ఫోటోలు, కొన్ని సార్లు న్యూడ్ ఫోటోలు లాంటి షేర్ చేస్తున్నారు.

ఆ మధ్య షారుక్ ఖాన్ కూతురు సుహానా బీచ్ ఒడ్డున తన తమ్ముడితో ఆడుకుంటూ బికినీలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై కొన్ని మీడియా సంస్థలు వక్రంగా వార్తలు రాయడంపై షారుఖ్ ఖాన్ ఆ మధ్య కాస్త మనస్తాపానికి గురయ్యారు. ఇలాంటివి తెలిసీ తెలియని తనంగా చెప్పుకోవచ్చు.

అయితే కొందరు స్టార్స్ పిల్లలు మాత్రం కావాలనే, పబ్లిసిటీ కోసమే అన్నట్లుగా న్యూడ్ ఫోటోలు పోస్టు చేస్తూ విచ్చలవిడిగా వ్యహరిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇవన్నీ సాధారణ జనాలకు విచ్చలవిడితనం అని అనిపించొచ్చు కానీ... సెలబ్రిటీ సర్కిల్ లో ఇవన్నీ కామన్. రేపు వారు ఎంచుకోబోయే సినీ, మోడలింగ్ ప్రొఫెషన్లో ఇవన్నీ ఉంటాయి.

English summary
The young lot of Bollywood star kids is growing up to be gorgeous and super stylish beings. Some of them are barely out of school but it doesn’t stop them from catching our fancy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu