డబ్బున్న స్టార్ హీరో బర్త్‌డే పార్టీ ఇలా లగ్జరీగా(ఫోటోలు)
ముంబై: బాలీవుడ్లో బాగా డబ్బున్న హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. తండ్రి బడా నిర్మాత కావడంతో హృతిక్ సినీ రంగం ప్రవేశం నల్లేరు మీద నడేకే అయింది. అయితే టాలెంట్ పరంగా మాత్రం హృతిక్ రోషన్ తనదైన ముద్ర వేసారు. తనదైన నటన, స్టైల్, డాన్స్, ఆకట్టుకునే శరీర సౌష్టవం వెరసి.... హృతిక్ అనతి కాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా మారి పోయాడు. తొలి సినిమా కహోనా ప్యార్ హై చిత్రంతో హిట్ కొట్టాడు.
ఈ రోజు హృతిక్ బర్త్ డే. 1974 జనవరి 10న జన్మించిన హృతిక్ నేటితో 38వ వడిలోకి అడుగు పెడుతున్నాడు. అ సందర్భంగా ముంబై తీరంలోని అరేబియా సముద్రంలో ఓ బోట్‌లో బర్త్ డే పార్టీని లగ్జరీగా జరుపుకున్నాడు. ఈ వేడుకలో హృతిక్ వైఫ్ సుజనె, ఇండస్ట్రీలో తనకి క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న అర్జున్ రామ్ పాల్, ప్రీతి జింతా, కరణ్ జోహార్, గౌరీ ఖాన్, చుంకీ పాండే తదితరులు పాల్గొన్నారు.
1980లో విడుదలైన ఆషా అనే చిత్రంలో హృతిక్ తన ఆరేళ్ళ వయసులో మొదటిసారిగా బాలనటుడిగా ఒక పాట సన్నివేశములో అదనపు నటుడిగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన హృతిక్ 2000లో కహొ నా... ప్యార్ హై అనే చిత్రములో మొట్టమొదటిసారిగా కధానాయకుడి పాత్రలో నటించాడు. ఆ చిత్రములో హృతిక్‌తో పాటు అమీషా పటేల్ హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. తన తండ్రి దర్శకత్వము వహించిన ఆ సినిమాలో రోషన్ రెండు ప్రధాన పాత్రలలో నటించాడు. అత్యుత్తమ చిత్రముగా ఫిలింఫేర్ పురస్కర్రము అందుకోవటమేకాక 2000లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రముగా నిలిచింది. దీంతో రాత్రికిరాత్రే హృతిక్ రోషన్ స్టార్ హీరోగా అవతరించాడు.

బ్లాక్ లెదర్ జాకెట్ తో బర్త్ డే పార్టీకి హాజరైన హృతిక్ రోషన్.

హృతిక్ సిస్టర్ ఇన్ లా... ఫరా ఖాన్ బర్త్ డే పార్టీకి హాజరైన దృశ్యం.

హృతిక్ బర్త్ డే పార్టీలో దర్శకుడు కరణ్ జోహార్.

బర్తతో కలిసి బర్త్ డే వేడుకకు హాజరైన హీరోయిన్ సోనాలి బింద్రే.

హృతిక్ బర్త్ డే బాష్ లో చుంకీ పాండే..

హృతిక్ బర్త్ డే బాష్ లో చుంకీ పాండే..

బర్త్ డే పార్టీలో అభిషేక్ కపూర్.

బోట్ పార్టీ లో కూర్చున్న కరణ్ జోహార్.

సంజయ్ కపూర్.

బర్త్ డే పార్టీలో హృతిక్ భార్య సుజనె.


Click it and Unblock the Notifications











